Home జాతీయ వార్తలు సిజెఐపై అభిశంసన నోటీసు

సిజెఐపై అభిశంసన నోటీసు

ind

రాజ్యసభ చైర్మన్‌కు అందజేసిన కాంగ్రెస్ సహా ఏడు ప్రతిపక్షాలకు చెందిన 64 మంది సభ్యులు
లోయా కేసులో తీర్పు తరువాత ఆకస్మిక పరిణామం కాంగ్రెస్ ప్రతీకార ధోరణి : అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ : అత్యంత అసాధారణ రీతిలో దేశ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై శుక్రవారం అభిశంసనకు నోటీసులు పంపించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆరు ఇతర ప్రతిపక్షాలు రాజ్యసభలో అభిశంసన తీర్మానానికి నోటీసు పంపించడం దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ప్రధాన న్యాయమూర్తి ప్రవర్తన సరిగ్గా లేదని, ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈ నోటీస్‌లో పేర్కొన్నారు. నోటీసును సంధించడానికి గల ఐదు కారణాలను ఇందులో పొందుపర్చారు. కేసుల కేటాయింపుల్లో ప్రధాన న్యాయమూర్తి పక్షపా తం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి ఈ నోటీసును అందించారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై తాము అభిశంసన తీర్మానానికి నోటీసును అందిస్తున్నట్లు తెలిపారు.ఎగువ సభ రాజ్యసభలోని 64 మంది ఎంపీల సంతకాలు ఈ నోటీసుపై ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశ చరిత్రలో ఇంతవరకూ ఏ సిజెఐ అభిశంసనకు గురి కాలేదు. అంతేకాకుం డా ఇప్పటివరకూ ఏ సిజెఐకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అభిశంసనకు నోటీసులు వెలువరించలేదు. ఈ నోటీసు అందడంతో ఉప రాష్ట్రపతి,రాజ్యసభ సార థి అయిన వెంకయ్య నాయుడు తదుపరి చర్యల కోసం చట్టపరమైన, నిబంధనల పరమైన సంప్రదింపులకు దిగుతున్నారని వెల్లడైంది. నోటీసుపై కాంగ్రెస్‌తో పాటు ఎన్‌సిపి, సిపిఎం, సిపిఐ,ఎస్‌పి, బిఎస్‌పి,ఐయుఎంఎల్ సభ్యులు సంతకాలు చేశారు. ఈ పార్టీల నేతలు తొలుత పార్లమెంట్ హాల్‌లో కలుసుకున్నారు.అభిశంన నోటీసుకు తుదిరూపం ఇచ్చి, తరువాత జట్టుగా వెళ్లి దానిని అందించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, సిబల్, రణదీప్ సూర్జేవాలా, సిపిఐ నేత రాజా, ఎన్‌సిపి నుంచి వేదాంత చవాన్ ఇతరులు హాజరయ్యారు.తొలుత ఈ నోటీసు పట్ల తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. తరువాత అవి నిర్ణయా న్ని మార్చుకున్నట్లు, నోటీస్‌కు దూరంగా ఉన్నట్లు వెల్లడైంది.
లోయా తీర్పు తరువాతి రోజు పరిణామం :భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహారశైలిపై పలు కోణాల నుంచి చాలా కాలంగా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే శుక్రవారమే ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడి న ధర్మాసనం సిబిఐ న్యాయమూర్తి లోయా మరణంపై కీలక తీర్పు వెలువరించింది. ఇందులో జస్టిస్ లోయా మృతిపై స్వతంత్య్ర దర్యాప్తు జరపాలనే పలు పిటిషన్లను కొట్టివేశారు. లోయాది సహజ మరణం అని, పిటిషనర్లు వారి తరఫు న్యాయవాదులది రాజకీయ స్వార్థపూరిత వాదనఅని ధర్మాసనం మండిపడింది.ఈ తీర్పును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.దేశ చరిత్రలోదుర్ది నం అని ప్రకటించింది. మరుసటి రోజే ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసనకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలను జట్టు చేసుకుని రంగంలోకి దిగింది.
బాధాతప్త హృదయంతో నోటీసు – కాంగ్రెస్ :ప్రధాన న్యాయమూర్తిపై బాధాతప్త హృదయంతో అభిశంసనకు దిగాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బాధతో ఈ చర్యకు దిగుతున్నా, ఇది అనివార్యం అవుతోందని వివరించారు.ప్రజా ప్రతినిధులుగా తాము ప్రధాన న్యా యమూర్తిని దేశానికి జవాబుదారి చేయాల్సి ఉందని, అందుకే ఈ అసాధారణ చర్యకు దిగామని సిబల్ తెలిపారు. ప్రతిపక్షాలు సిజెఐపై అసంతృప్తితో లో లోన రగులుతూ ఉన్నప్పటికీ అభిశంసన వంటి తీవ్ర చర్యకు దిగడం ఆకస్మికమే అయింది. ఏదేనీ కీలక పదవీ గౌరవం కన్నా చట్టం గౌరవం మిన్న అని తాము భావిస్తున్నట్లు కపిల్ స్పష్టం చేశారు. కేవలం అభిశంసననే కాకు ండా ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలిపై దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సమగ్ర దర్యాప్తు జరిగితేనే సత్యాలు వెలుగులోకి వస్తాయి. న్యాయవ్యవస్థ స్థిరతతోనే ప్రజాస్వామిక ప్రక్రియ పరిఢవిల్లుతుంది. కార్యనిర్వాహక వర్గం స్వతంత్రత, రాజ్యాంగ విధులను విశ్వసనీయతతో, భయం లేకుం డా, సమాన దృక్పథంతో పాటించే అవకాశం ఉండాలని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రతీకార ధోరణి : జైట్లీ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసునుఅందించడం ఆ పార్టీ ప్రతీకార ధోరణిని వెల్లడిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. ఇది పూర్తి స్థాయిలో ప్రతీకార వ్యాజ్యంగా ఉందని ఆయ న వ్యాఖ్యానించారు.అసత్యాలతో సాగిన కుట్రను ఛేధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోయా మృతికేసుపై తీర్పు ఇచ్చారని జైట్లీ గుర్తు చేశారు. దీనితో ఎటూ పాలుపోని కాంగ్రెస్ ప్రధాన న్యాయమూర్తిపై ప్రతీకా ర చర్యకు దిగుతోందని జైట్లీ ఫేస్‌బుక్‌లో స్పందించారు. అత్యున్నత స్థా యి న్యాయమూర్తిని తప్పుపట్టడంలో అర్థంపర్థం ఉండాలని, సిజెఐపై అభిశంసన కేవలం బాధ్యతలలో అసమర్థత, లేదా అనుచిత ప్రవర్తనల రుజువు దశలోనే చేపట్టాల్సి ఉంటుందని జైట్లీ తెలిపారు.అయితే ఈ నీతినిరివాజును పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ తమ మిత్రులతో కలిసి అభిశంసనకు దిగడం కేవలం రాజకీయ అతి చర్య అవుతుందని వ్యాఖ్యానించారు.ప్రతిపక్షాలు ఈ విధంగా అభిశంసన అధికారాన్ని ఉపయోగించుకోవడం ప్రమాదకర పరిణామం అవుతుందని జైట్లీ తెలిపారు. చిల్లర మల్లర అంశాలపై కూడా కొద్ది మంది సంతకాలతో అభిశంసనలకు వెళ్లడం కష్టమేమీ కాదని,అయితే జరిగే నష్టం ఆలోచించాల్సిన విషయం అని వ్యా ఖ్యానించారు. కాంగ్రెస్ తప్పులు సుప్రీంకోర్టు స్థాయిలో వెల్లడికావడంతో పట్టలేని ఆక్రోశంతో ఈ ప్రతీకార పిటిషన్‌కు దిగారనే తాను తొలుతగా స్పం దిస్తున్నట్లు ఆర్థిక మం త్రి తెలిపారు. లోయా మృతి కేసులో సుప్రీంకోర్టు సుదీర్ఘమైన114పేజీల తీర్పు వెలువరించిందని,ఇందులో పేర్కొన్న పలు కీలక అ ంశాలపై సమగ్రంగా అధ్యయనం అవసరం అనిజైట్లీ అభిప్రాయపడ్డారు. అసత్యాలను సృష్టించడంలో దేశంలోని కొందరు రిటైర్డ్ న్యాయమూర్తులు ,న్యాయవాదులు పాటుపడుతున్నారని జస్టిస్ లోయా కేసులో సుప్రీంకోర్టు పేర్కొందని జైట్లీ గుర్తు చేశారు.