Home తాజా వార్తలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వందేళ్ల వృద్ధుడు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వందేళ్ల వృద్ధుడు

Centenarian among high-risk citizens vaccinated

 

తొలి టీకా తీసుకున్న మంత్రి ఈటల
నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో కలిపి మొదటి రోజు 4,558 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యశాఖ పేర్కొంది. సోమ వారం వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లలో 90 శాతం మంది వృద్దులు, పది శాతం మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పే ర్కొంది. అయితే సెక్రటేరియట్ వద్ద ఉన్న మెడికవర్ హాస్పిటల్‌లో వందేళ్ల వృద్దుడు ఒకరు వ్యాక్సిన్ వేయించుకోవడం గమనార్హం. వ్యాక్సిన్ తీసుకు న్న అనంతరం కూడా ఆయనకు ఎలాంటి రీయాక్షన్లు రాలేదని అధికారు లు తెలిపారు. కానీ కొంత మందికి మాత్రం వ్యాక్సిన్ వేసిన చోట నొప్పి, ఎర్రబడడం వంటి సమస్యలు వచ్చాయన్నారు.

కరీనంగర్‌‌ జిల్లా హుజురాబాద్ ఏరియా హాస్పిటల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సెకండ్ ఫేజ్‌లో వ్యాక్సినేషన్‌లో భాగంగా తొలి టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నియం త్రణకు వ్యాక్సిన్ మాత్రమే శాశ్వత పరిష్కారమన్నారు. అపోహలు, భయాలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ శశాంక, డిఎంఇ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అంతేగాక కింగ్ కోఠిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సిఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించి, వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు ఉన్నారు.

కరోనా వ్యాక్సిన్ ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్టు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. సెంటర్ వద్దకే వచ్చి అప్పటికి అప్పుడే పేరు, వివరాలు నమోదు చేయించుకుని, వ్యాక్సిన్ వేసుకోవచ్చని పేర్కొంది. అంతేగాక పాత టెస్ట్ రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్ వంటి వి చూపిస్తే సెంటర్ల వద్ద ఉండే తమ డాక్టర్లే కో మార్పిడ్ సర్టిఫికెట్లు ఇస్తారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. అయితే సోమవారం కొవిన్ సాప్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తడం వలన వ్యాక్సినేషన్‌కు కాస్త ఆటం కం కలిగిందన్నారు.

Centenarian among high-risk citizens vaccinated in TS