Home జాతీయ వార్తలు టెస్టులు ఎవరికి అవసరం ?

టెస్టులు ఎవరికి అవసరం ?

corona tests

 

కరోనా పరీక్షలపై కేంద్రం స్పష్టత

ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా.. తుమ్మినా భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారన్ని సూచించింది.
* గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసివచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందే.
* కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పక పరీక్షలు చేయించుకోవాలి.
* వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ విధిగా పరీక్షలు చేయించుకోవాలి.
* ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన, పొందుతున్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే.
* శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

 

Center clarity on corona tests