Tuesday, April 23, 2024

తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్రం : హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

కూసుమంచి: దేశం తెలంగాణ వైపు చూస్తోందనీ దేశంలోని రైతాంగం కేసిఆర్ వైపు చూస్తోందనీ వైద్య, రాష్ట్ర ఆరోగ్య, శాఖ మంత్రి తన్నీరు హరీష్ అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన బిఆర్‌ఎస్ అంకుర సన్నాహక సమావేశంలో అయన మాట్లాడుతూ, ఖమ్మంలో జరిగే బిఆర్‌ఎస్ సభ జాతీయ రాజకీయాలను మలుపుతిప్పే సభ అని ఈ దేశం భాగుపడాలంటే బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపి కొడుతుంది.. ఖమ్మం లో జరిగే సభకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరవుతారని తెలిపారు. రెండు నదులు కిష్ణా, గోదావరి నీళ్లను పొందే ఏకైక నియోజకవర్గం పాలేరని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగ పాలేరు నియోజకవర్గంలో తమ్మలు మొలిసినాయని విమర్శించారు.

వ్యవసాయ దండగ అన్న వారు, ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబున్నారని,బషీర్ బాగ్ లో రైతులను పిట్టల్ని కాల్చి నట్లు కాల్చీన నాయకుడు రైతుల గురించి మాట్లాడం విడ్డూరమని చెప్పులు అరిగేటట్టు తిరిగినా ఎరువులు అందించలేని కాంగ్రెస్ నాయకులు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులను నట్టేట ముంచే నల్ల చట్టాలను తీచుకొచ్చిన బిజేపి కుడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. బిజెపి నాయకులకు ఓటు అడిగే హక్కు ఉందా అని విమర్శలు గుప్పించారు. బోరు మీటరు కాడ మీటరు పెట్టనన్న దమ్మున్న నాయకుడు కేసిఆర్ అని అన్నారు. రైతు భీమా, రైతు బందు, నాణ్యుమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక నాయకుడు కెసిఆర్ అని నాలుగేళ్లలో కాళ్లేశ్వరం పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లందిస్తున్నామన్నారు.

మీటింగ్ కు హాజరయ్యే సిపిఎం, సిపిఐ కార్యకర్తలను కూడా ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు తీచుకురండి అని అన్నారు.ఈ సభను విజయవంతం చేస్తే నే అతిపెద్ద పండుగ అని పాలేరు నియోజకవర్గం నుండి 50వేల మంది తరలి రావాలని పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News