Home ఆదిలాబాద్ బాలసదనం, శిశుగృహ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

బాలసదనం, శిశుగృహ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

collcterకలెక్టరేట్: తల్లిదండ్రుల ప్రేమకు దూ రమైన అనాధ చిన్నారి బాల, బాలికలకు రక్షణతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించి వారికి మంచి భవి ష్యత్తుని అందించడానికి అవసరమైన సేవలు అందిం చాలని శిశు గృహ మేనేజరుని, సోషల్ వర్కర్, ఆయా లకు జిల్లా కలెక్టరు ఎం.జగన్మోహన్ ఆదేశించారు. శని వారం జిల్లా కేంద్రంలోని శిశు గృహ కేంద్రం, ఆయా లకు జిల్లా కలెక్టరు ఎం జగన్మోహన్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని శిశు గృహ కేంద్రం, బాల సదనం కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి కేంద్రాల నిర్వహణ పనితీరుని పరిశీలించారు. ముందుగా శిశు గృహ కేంద్రాన్ని సందర్శించి పుట్టిన నుండి 5 సంవత్స రాలలోపు అనాధ పిల్లలను ఏ విధంగా సేవలు అంది స్తుంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిశు గృహం లో పెరుగుతున్న 11 మంది చిన్నారి బాల బాలికలను కలెక్టరు ఎత్తుకొని వారిని ఆడించారు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయి అనాదలుగా మారిన చిన్నారులకు ప్రభుత్వం రక్షణ కల్పించడానికి శిశు గృహాల ద్వారా సేవలు అందించి వీరి జీవితానికి తోడ్పాటు అందిస్తున్నదని తెలిపారు. ముందుకు వచ్చిన తల్లితండ్రులకు దత్తత ఇచ్చి నిరాదరణఖు గురి అయిన వారికి ప్రభుత్వం ద్వారా ఆదుకోవడం జరుగుతు న్నదని తెలిపారు. ఇప్పటికే శిశు గృహం నిర్వహణ కొరకు రూ. 10 లక్షలు మంజూరి చేయడం జరిగంద ని ఇంకా అవసరమైన పేయింటింగ్స్, చిన్న పిల్లల అవసరాలకు అదనంగా బాల సదనాన్ని సందర్శించి అందులో ఉంటున్న 21 మంది చిన్నారులను ఒకే గదిలో ఉంచి శిక్షణ ఇస్తున్నందుకు వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులను పది మందికి ఒక రూమ్ చొప్పున ఏర్పాటు చేసి వారికి మంచి వాతావరణం ద్వా రా అన్ని సౌకర్యాలు కల్పించాలని మేనూ సక్రమంగా అందించాలని, ఇప్పటి నుండే వారికి మరుగుదొడ్లను వాడుకునే అలవాటు చేయాలని, డైనింగ్ హాలు పెద్దగా అవసరమైన ఫర్నీచరు సౌకర్యంతోపాటు క్రీడ పరికరాలు అందించాలని అసంపూర్తిగా ఉన్న రూమ్‌ల నిర్మాణాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం సత్వ రమే పూర్తి చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. బాల పథకంలో చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనందుకు ఐసిడిఎస్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. బాల సదనం అదనపు తరగతుల భవన నిర్మాణ పనులు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనుల కుగాను అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు అంది ంచాలని, ఎగుడు దిగుడుగా ఉన్న భూమి లెవల్ చేయి ంచాలని బాల కేంద్రం పనితీరుపై ప్రత్యేక శ్రద్ద వహిం చాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. శిశు గృహం నిర్వహణ గురించి ఐసిడిఎస్ పిడి ఈ విధంగా వివరిం చారు. మొత్తం 11 మంది చిన్నారులకుగాను ఏడుగురు ఆడపి ల్లలు, నలుగురు బాలురు ఉన్నారు. వీరిలో 5 సంవత్స రాలలోపు ఇరువురు, 2 సంవత్సరా లలోపు 8 మంది పిల్లలు, రెండు మాసాలలోపు ఒకరు ఉన్నారని వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరి ంచారు. పర్యటనలో జిల్లా కలెక్టరు వెంట ఐసిడి ఎస్ పిడి పద్మావతి, తహసీల్దార్ వర్ణ, ఐసిడిఎస్ పిఓ రా జేంద్ర ప్రసాద్, సిపిఓ కార్యాలయ ఏడి సత్యనారాయణ రెడ్డి, శిశు గృహ మేనేజరు సురేష్, సోషల్ వర్కర్ స్వ ప్న, బాల సదనం వార్డెన్ తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారిని జిల్లా కలెక్టరు ఎం జగన్మోహన్ ఆదేశించారు. శనివారం కలె క్టరు చాంబర్ నందు సెప్టెంబర్ 28న నిర్వహించబోవు కొండ లక్ష్మణ్ బాపూజి జయంతి సందర్భంగా ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా కలెక్టరు అధ్యక్షతన బిసి సంఘం, పద్మశాలి సంఘం ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పూలే జయంతి వేడుకలు ఏ విధంగా నిర్వహిస్తున్నామో అదే తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజి 101 జయంతి వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు.