Saturday, April 20, 2024

ఎన్నికలకు కేంద్ర బలగాలు

- Advertisement -
- Advertisement -

Central forces for GHMC elections

 

22,000తో భారీ భద్రత
167 హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత
4,979 పోలింగ్ కేంద్రాలు
29బార్డర్ చెక్‌పోస్టులు, 293 పికెట్‌లు
రూ.1.45కోట్లు స్వాధీనం, 4,187గన్స్ స్వాధీనం
పోలింగ్ స్టేషన్లకు జియో ట్యాగింగ్
నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికలకు భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల కోసం 22,000మందితో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జిహెచ్‌ఎంసి ఎన్నికలకు 89వార్డులు ఉన్నాయని తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ స్టేషన్లు 4,979, 2016లో పోలిస్తే 817 కొత్తగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో నార్మల్ పోలింగ్ కేంద్రాలు 2,146, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 1,517, 167 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వాటిలో భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి వద్ద ఆరు ఆర్మడ్ రిజర్వు బలగాలను మోహరించామని తెలిపారు.

406 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 29 బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. హైపర్ సెన్సిటీవ్ ఏరియాల్లో 293 పికెట్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 4,187 గన్స్ డిపాజిట్ చేశారని, 3066మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. నగరంలో ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.45కోట్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రూ.10లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో 63 ఫిర్యాదులు రాగా అందులో 55 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6గంటల వరకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, తర్వాత ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఇన్స్‌స్పెక్టర్ స్థాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించామని తెలిపారు.

స్ట్రైకింగ్ ఫోర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామని తెలిపారు. సోషల్ మీడియాపై దృష్టి సారించామని, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 49 నాన్ బేయిలబుల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నగరంలోని 4లక్షల సిసిటివిల కెమెరాలను ఎసిపి, డిసిపి లెవల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెంటనే వెళ్లి పోవాలని ఆదేశించారు.

ఎన్నికల ఏజెంట్లు వాహనాల్లో రావడానికి అనుమతి లేదని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వాహనంలోనే రావాలని కోరారు. అభ్యర్థుల ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు వచ్చే వారు తమ వాహనాలను పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో పార్కింగ్ చేయాలని అన్నారు. సమావేశంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, అదనపు పోలీస్ కమిషనర్లు అనిల్‌కుమార్, డిఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్లు తరుణ్‌జోషి, ఎఆర్ శ్రీనివాస్, విశ్వప్రసాద్, రమేష్, ఎడిసిపి సునీత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News