Tuesday, March 19, 2024

కేంద్రం డబ్బులు వెనక్కి వెళ్లొద్దు: హరీష్

- Advertisement -
- Advertisement -

Harish rao

 

హైదరాబాద్: సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూడాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. అరణ్యభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌పై మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా ఎప్పటికప్పుడు యుసిలు ఇవ్వాలన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ శాతం వచ్చే నిధులకు తాము మ్యాచింగ్ నిధులు ఇస్తామని, కేంద్రం నుంచి వచ్చే డబ్బులు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నారు. గిరిజనుల సంక్షేమానికి అడిగిన నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తామని హరీష్ స్పష్టం చేశారు. గిరిజన శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరుతున్నామని, కల్యాణ లక్ష్మీ, పిల్లల ఆహారం, పాలబిల్లుల గ్రీన్ ఛానెల్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పెరిగిన అవసరాలకు అదనపు కేటాయింపులు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రైతు సమన్వయ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Central Funds are Dont return says Harish Rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News