Thursday, April 25, 2024

సోలార్ సొమ్ములు గుజరాత్ కేనా !!

- Advertisement -
- Advertisement -

కేంద్ర నిధుల్లో ఒక్క గుజరాత్‌కే 55 శాతం నిధులు
ఇతర రాష్ట్రాలను పట్టించుకోని మోడీ సర్కార్
దేశంలో నాలుగేళ్లుగా 3479 కోట్ల నిధులను విడుదల చేస్తే
ఇందులో రూ. 1923 కోట్లు ప్రధాని స్వరాష్ట్రానికే

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌కు నిధుల వరద ప్రవహిస్తోంది. మొత్తం దేశంలొ ఇతర రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే గుజరాత్ ఒక్కటే మరో ఎత్తు అన్నట్లు ఆ రాష్ట్రాన్ని కేంద్ర సర్కారు నిధులు ఇచ్చి ప్రొత్సహిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో ఒక్క సోలార్ విద్యుత్ రంగమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రొత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తున్న విషయాన్ని వారు విశ్లేషిస్తూ.. గత నాలుగేళ్లుగా రూ. 3479 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో రూ. 1923 కోట్ల నిధులు ఒక్క గుజరాత్ రాష్టానికే దక్కడం అంటే దీని అర్థం పరమార్థం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అంటే సోలార్ విద్యుత్ నిధుల్లో దాదాపు 55 శాతాన్ని ఒక్క గుజరాత్ కే ఖర్చు కేంద్ర సర్కారు తన పక్షపాతాన్ని చాటుకుందని వారు గుర్తు చేస్తున్నారు. కర్నాటక, గోవా వంటి రాష్ట్రాలకు నామమాత్రంగా కోటి నుంచి మూడు కోట్ల నిధులను వెచ్చించి గుజరాత్ కు మాత్రం 55 శాతం నిధులను మళ్లించడం పట్ల ఇతర రాష్ట్రాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ , ఇంధన శాఖ మంత్రి ఆర్‌కె. సింగ్ గురువారం నాడు పార్లమెంటుకు రాతపూర్వకంగా ఒక లేఖను సమర్పించడం గమనార్హం.
భారీ నిధులన్నీ గుజరాత్‌కే
సోలార్ విద్యుత్ రంగంలో భారీ నిధులన్నీ కూడా గుజరాత్‌కే దక్కుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు తూతూ మంత్రంగానే ఇచ్చినట్లు ఇచ్చి సింహభాగం ( దాదాపు 55 శాతం ) గుజరాత్‌కే పెద్దపీట వేస్తోంది. నిజానికి రెనెవెబుల్ రంగంలో గుజరాత్ తర్వాత టాప్ ఐదు రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లు ఉండగా వీటికి గుజరాత్‌కు ఇచ్చినట్లు 55 శాతం నిధులు ఇవ్వలేదు. తూతూ మంత్రంగా అలా కనిష్టంగా 10 కోట్ల నుండి గరిష్టంగా రూ. 5ం కోట్ల వరకే కేటాయింపులు చేసింది. ఉదాహరణకు 2020 ఏడాదిని తీసుకుంటే ఆ సంవత్సరం మార్చి నెలలో ఒక్క గుజరాత్‌కే రూ. 118.27 కోట్ల నిధులను కేంద్రం సెంట్రల్ ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కింద కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో మరే రాష్ట్రానికి కూడా కేంద్రం కేటాయించక పోవడం గమనార్హం.

ఈ కేటాయింపులు పరిశీలిస్తే మహారాష్ట్రకు రూ.52.88 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌కు రూ. 51.71 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 30. 48 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 29.02 కోట్లు మాత్రమే కావడం గమనార్హం ఈ కేటాయింపుల విషయం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ఈ మేరకు పార్లమెంట్‌కు రాతపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంగా వెల్లడించడం విశేషం. రాష్ట్రాల వారీ కేటాయింపులు పరిశీలిస్తే గుజరాత్‌కే 55 శాతం కేటాయించిన విషయం స్పష్టం అవుతోంది. దీంతో సోలార్ సగం సొమ్ములు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కేనా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 నుండి 2022 వరకు గడచిన మూడేళ్లుగా కేంద్రం కేటాయింపులను ఓ సారి పరిశీలిస్తే…

రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం నిధుల కేటాయింపులు.. 2019-20 నుండి 2022-23 నవంబర్ వరకు
కేంద్ర నిధులు ఏ రాష్ట్రానికి? ఎన్నెన్ని ??
1. తెలంగాణ రూ. 53.99 కోట్లు
2. ఆంధ్రప్రదేశ్ రూ. 6.31 కోట్లు
3. అరుణాచల్ ప్రదేశ్ రూ. 0.15 కోట్లు
4. అస్సాం రూ. 0.43 కోట్లు
5. అండమాన్ , నికోబార్ రూ. 0.35 కోట్లు
6. బీహార్ రూ. 0.89 కోట్లు
7. చండీఘర్ రూ. 0.85 కోట్లు
8. చత్తీస్‌ఘడ్ రూ. 2.05 కోట్లు
9. గోవా రూ. 3.59 కోట్లు
10. గుజరాత్ రూ. 1923.57 కోట్లు
11. హర్యానా రూ. 264.91 కోట్లు
12. హిమాచల్ ప్రదేశ్ రూ. 8.57 కోట్లు
13. జమ్ము, కాశ్మీర్ రూ. 16.70 కోట్లు
14. జార్ఘండ్ రూ. 16.62 కోట్లు
15. కేరళ రూ. 70.79 కోట్లు
16. కర్నాటక రూ. 1.26 కోట్లు
17. మధ్యప్రదేశ్ రూ. 88.74 కోట్లు
18. మహారాష్ట్ర రూ. 239.17 కోట్లు
19. మణిపూర్ రూ. 0.36 కోట్లు
20. మేఘాలయ రూ. 0.28 కోట్లు
21. మిజోరాం రూ. 0.05 కోట్లు
22. ఢిల్లీ రూ. 9.77 కోట్లు
23. ఒడిస్సా రూ. 0.77 కోట్లు
24. పంజాబ్ రూ. 92.36 కోట్లు
25. రాజస్థాన్ రూ. 521.31 కోట్లు
26. తమిళనాడు రూ. 30.00 కోట్లు
27. త్రిపుర రూ. 11.32 కోట్లు
28 . ఉత్తర ప్రదేశ్ రూ. 83.70 కోట్లు
29. ఉత్తరాఘండ్ రూ. 9.76 కోట్లు
30. ఇతరాలు (కేంద్రపాలిత ప్రాంతాలు) రూ. 20.75 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News