Thursday, April 25, 2024

చైనాకు షాక్..!!!

- Advertisement -
- Advertisement -

Central government has announced a ban on Chinese apps

 

టిక్‌టాక్, షేర్ ఇట్, లైకీ, బ్యూటీ ప్లస్, యుసి బ్రౌజర్‌సహా
ఆ దేశపు 59 యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం

న్యూఢిల్లీ : చైనా కంపెనీలతో సంబంధమున్న యాప్‌లపై కేంద్రం కొరడా ఝలిపించింది. టిక్‌టాక్, హెలో, స్వీట్ సెల్ఫీ, షేర్ ఇట్, లైకీ, బ్యూటీ ప్లస్, విగో వీడియో, క్యూక్యూ ప్లేయర్, యుసి బ్రౌజర్‌సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగించే కార్యకలాపాలతో వీటికి ప్రమేయమున్నట్టుగా సమాచారమున్నదని కేంద్ర సమాచార సాంకేతికశాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. దేశ రక్షణ, ప్రజల భద్రత దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. డేటా భద్రత, ప్రైవసీ(గోప్యత)కి సంబంధించి ఈ యాప్స్‌పై పలువురి నుంచి ఆందోళన వ్యక్తమైందని, ఫిర్యాదులందాయని తెలిపింది.

ఈ నెల 15న గల్వాన్ సరిహద్దున ఇరు దేశాల సైన్యాల ఘర్షణలో 21మంది భారత జవాన్లు మృతి చెందిన ఘటనతో చైనా పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలన్న డిమాండ్లకు బలం చేకూరుతోంది. దాంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. అంతేగాక చైనీస్ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారానికి భద్రత లేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News