Home తాజా వార్తలు జిఎస్‌టి మోసాలపై దృష్టి

జిఎస్‌టి మోసాలపై దృష్టి

Central government has reduced GST on various goods

ధరలకే వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తింపు                                                                                                      పన్ను తగ్గింపును ఖాతరు చేయని యజమానులు                                                                                                        తనికీలకు శ్రీకారం చుట్టిన యాజమనులు తూనికలు, కొలతల  అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తూనికలు, కొలతలశాఖ తాజాగా వస్తు, సేవా పన్ను (జిఎస్‌టి) మోసాలపై దృ ష్టి సారించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై జిఎస్‌టిని తగ్గించింది. అయినా పలువురు ట్రేడర్లు, దుకాణాల యాజమానులు మాత్రం పాత ధరలకే వస్తువులను విక్రయిస్తున్నారని తూనికలు, కొలతలశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల కేంద్రం పలు వస్తువులపై జిఎస్‌టిని తగ్గించడంతో పాటు మరిన్ని వస్తువులపై పూర్తిగా రద్దు చేసినా… అమలు మాత్రం ఆచరణలో ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు కాకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగడం లేదు. దీంతో జిఎస్‌టి ప్రకారం వస్తువులను విక్రయాలను చేపట్టాలని తూనికలు, కొలతలశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వ్యాపార సముదాయాలకు సంబంధించిన యజమానులు మాత్రం ఇటు కేంద్రం తగ్గించిన, పూర్తిగా రద్దు చేసిన వస్తు సేవా పన్నును ప్రజలకు చేరకుండా పాత ధరలకే వస్తువులను విక్రయాలను చేపడుతుండడంతో తూనికలు, కొలతలశాఖ దాడులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగాఏ జిఎస్‌టి మోసాలపై సంబంధిత శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. మహానగరం పరిధిలో వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు అనేక దుకాణాలపై తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిఎస్‌టి ధరల అమలులో ట్రేడర్లు నిర్లక్షాన్ని ప్రదర్శిస్తున్నట్లు గమనించారు. కనీసం తగ్గించిన వస్తు సేవా పన్నులను పరిగణలోకి కూడా తీసుకోవడం లేదని గుర్తించారు. పాత ధరల ప్రకారమే వస్తువులను వినియోగిస్తున్నట్లు గ్రహించారు.

ఈ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించిన పలు వ్యాపార, వ్యాణిజ్య సంస్థలపై తూనికలు, కొలతలశాఖ అధికార యంత్రాగం కేసులను కూడా నమోదు చేసింది. ఒక మహా నగరం లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన కింద పలు వ్యాపార, వాణిజ్య సంస్థ లపై 62 కేసులను నమో దు చేసింది. జిఎస్‌టి అమలును పూర్తిగా పక్కకు పెట్టిన్నారని గుర్తించిన అధికారులు తనిఖీలను కేవలం మహానగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించిన అధికారులు త్వరలో రాష్ట్రవ్యాప్త దాడులకు దిగే అవకాశముందని అధికారాల వర్గాల భావిస్తున్నాయి. ఇందుకోసం తూనికలు, కొలతలశాఖ ఉన్నతాధికారులు అవసరమైన కసరత్తును చేస్తున్నారు.

తగ్గించిన వస్తువుల వివరాలివి….
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు రకాల వస్తువులపై సేవా పన్నులను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. మరిన్నింటిపై 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. కొన్ని వస్తువులపై పూర్తిగా రద్దు చేశారు. ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా జిఎస్‌టి తగ్గించారు. అయితే వ్యాపా ర, వాణిజ్య సంస్థల యాజమానులు మాత్రం యధావిధిగానే పాత ధరలకే విక్రయాలు జరుపుతున్నారు. ఇ ందులో ప్రధానంగా గృహోపకరణాలైన రిఫ్రిజిరేటర్లు, వాషిం గ్ మిషన్లు, వాక్యూమ్ క్లినర్లు, వాటర్ హిటర్లతో పాటు మరిన్నింటిపై 28 శాతంగా ఉన్న జిఎస్‌టి ని 12 శాతానికి తగ్గించారు. నిర్మాణ రంగంలో రాళ్ళకు సం బంధించి వాటిపై జిఎస్‌టిని తగ్గించారు. వీటిపై 18 శా తంగా ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించారు. శానిటరీ ప్యాడ్స్‌తో పాటు ఆరోగ్యకరమైన వస్తువులతో పాటు మరి న్ని వస్తువులపై వస్తు సేవా పన్నులను రద్దు చేశారు. పాద రక్షలకు సంబంధించి 500 రూపాయల విలువ చేసే చె ప్పులకు ఐదు శాతంగా ఉండే జిఎస్‌టిని పరిధిని వెయ్యి రూపాయల వరకు పెంచారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై కూడా జిఎస్‌టి కొంత మేరకు తగ్గించారు.

ఏకకాలంలో తనిఖీలు….
జిఎస్‌టి మోసాలపై దృష్టి సారించిన తూనికలు, కొలతలశాఖ గురువారం పలు వ్యాపార సంస్థలపై ఏక కాలంలో తనిఖీలను చేపట్టారు. తూనికలు, సంబంధిత శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 36 మంది అధికారులు 18 బృందాలుగా ఏర్పడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సంస్థలపై తనిఖీలు చేశారు. ఇందులో ప్రధానంగా జిఎస్‌టి అమలు ఉల్లంఘన, ఎంఆర్‌పి అదనంగా జిఎస్‌టి వసూలు, తగ్గిన జిఎస్‌టి ధరలను అమలు చేయకపోవడం తదితర మోసాలకు జరుగుతున్నట్లు గుర్తించి 62 కేసులను నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా మల్కాజ్‌గిరిలోని యస్ ఎలక్ట్రానిక్స్‌పై పంజాగుట్టచ ఏషియల్ ఎలక్ట్రానిక్స్, తార్నాక బిగ్‌బజార్, చిక్కడపల్లిలోని లో టస్ హోంనీడ్స్, మాదాపూర్‌లోని రిలయన్స్ మార్ట్, సికింద్రాబాద్‌లోని కోపాల్ కంప్యూటర్స్, లాప్‌టా ప్స్, అబిడ్స్ మెట్రో, సెవెన్ స్టేప్ ఫుట్‌వేర్, సెంట్రో, ఇసిఐఎల్ మోర్ సూపర్‌మార్కెట్, శ్రీ గురుకృప గ్లా స్ ప్లైవుడ్ హార్డ్‌వేర్, బాలానగర్ గౌరవ్ సూపర్ మా ర్కెట్, శంషాబాద్‌లోని హనుమాన్ హార్డ్‌వేర్, భగవతి ట్రేడర్స్‌లపై ఒక్కో కేసును, అబిడ్స్ మోచిపై రెండు కేసు లు, బజారాహిల్స్ రియలన్స్ డిజిటల్, సరూర్‌నగర్ బజాజ్ హోం అప్లైయ్‌న్సెస్, మలక్‌పేట వెంకటరమణ పె యింట్స్ హార్డ్‌వేర్‌లపై మూడు కేసులను నమోదు చేశారు.

నిత్య పర్యవేక్షణ: కమిషనర్
అధిక ధరల అమలు, జిఎస్‌టి మోసాలతో పాటు వస్తువు లు నాణ్యత, ధరల అమలుకు సంబంధించి తూనికలు, కొలతలశాఖ నిబంధనలకు అనుగుణంగా వ్యాపార, వా ణిజ్య కేంద్రాలు నడుచుకోవాలని ఆ శాఖ కంట్రోలర్ అ కున్ సబర్వాల్ తెలిపారు. ప్యాకేజ్డ్ వస్తువులపై తగ్గిన ధ రల ప్రకారమే విక్రయిస్తున్నారా, పాత ధరలకే అమ్ముతున్నారానే అంశాలను నిత్యం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.