Thursday, April 25, 2024

ఎపిలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Central Govt Has Announced Nuclear Power Plant In AP

న్యూఢిల్లీ: ఎపిలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఈ ప్లాంటును నిర్మించబోతున్నామమని తెలిపింది. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ప్లాంటులో నిర్మించనున్నట్టు వెల్లడించింది. అణు విద్యుత్ కేంద్ర ఏర్పాటుకు సంబంధించి రాజ్యసభలో టిడిపి సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్రం ఈ మేరకు స్పష్టత ఇస్తూ.. ఈ పవర్ ప్లాంట్ కోసం అమెరికాకు చెందిన ‘వెస్టింగ్ హౌస్ ఎలెక్ట్రిక్’ సంస్థతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Central Govt Has Announced Nuclear Power Plant In AP

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News