వెల్ కమ్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో రిలయెన్స్ జియో ఇచ్చిన ప్రకటనల్లో నరేంద్ర మోడీ ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. ఇక, పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నట్లు… పేటీఎం కూడా తమ ప్రకటనల్లో నరేంద్ర మోడీ ఫోటోను వాడుకుంది.
దేశ ప్రధాని ఫోటోను తమ కంపెనీని ప్రమోట్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చా.. అనే అనుమానం ప్రతి భారతీయుడికి ఆ ప్రకటనను చూసినప్పుడు కలిగింది. ఏ కంపెనీ అయినా… ఓ వ్యక్తి ఫోటోను తమ కంపెనీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం వాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అన్నా అయిఉండాలి లేదంటే ఆ వ్యక్తి నుంచి అంగీకారం అయినా తీసుకోవాలి.
అయితే.. ఈ రెండు కంపెనీలు ప్రధాని నుంచి ఎటువంటి సమ్మతి తీసుకోకుండానే మోడీ ఫోటోను తమ ప్రకటనల్లో వాడుకున్నందకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.
అంతే కాదు.. ఎంబ్లమ్ అండ్ నేమ్స్ యాక్ట్ 1950 కింద ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు ముందస్తు అనుమతి లేకుండా వాడటానికి వీలు లేదు. అందుకే.. ముందస్తు అనుమతి లేకుండా మోడీ ఫోటోను వాడిన ఈ కంపెనీకు ప్రభుత్వం ఫెనాల్టీని కూడా విధించనుంది. అయితే… ఈ నోటీసులకు సంబంధించి ఇంకా సదరు కంపెనీల నుంచి ఎటువంటి వివరణా రాలేదు.