Friday, March 29, 2024

సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

- Advertisement -
- Advertisement -

Central Govt released OTT platform guidelines

న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఓటిటిలపై కేంద్రప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఓటిటిల్లో అసభ్య, అశ్లీల, హింసాత్మక, సామాజిక ఉద్రిక్తతలు పెంచే కంటెంట్ లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. వయసు ఆధారంగా 5 విభాగాలుగా ఓటిటిని విభజన చేయనున్నట్టు ఆయన తెలిపారు. మహిళలు, చిన్నారులు, దలితులను అవమానించే కంటెంట్ లను కేంద్రం బ్యాన్ చేయనుంది. ఓటిటిల్లో జాతీయ సమగ్రత, సమైక్యతను దెబ్బతీయరాదని ఆదేశించింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై నియంత్రణ చేపట్టనుంది. అసత్య ప్రచారం ప్రారంభిచే మొదటి వ్యక్తి వివరాలు కచ్చితంగా చెప్పాలనే నిబంధన పెట్టింది. ఫిర్యాదు చేసిన 24గంటల్లోనే అసత్య ప్రచారాన్ని తొలగించాలని సూచించింది. 24గంటలూ దర్యాప్తు సంస్థలకు అధికారులు అందుబాటులో ఉండాలని కేంద్రం ఆదేశించింది. ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు దేశంలోనే ఉండాలని తెలిపింది. ఓటిటిలకు సెన్సార్ బోర్డులాగా ప్రత్యేక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది.

Central Govt released OTT platform guidelines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News