Thursday, April 18, 2024

వ్యాక్సినేషన్‌పై గీతాన్ని విడుదల చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Central govt released song on Corona virus

 

న్యూఢిల్లీ : కరోనా టీకా కార్యక్రమం 100 కోట్ల డోసుల పంపిణీకి చేరువవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆడియో విజువల్ గీతాన్ని విడుదల చేసింది. వ్యాక్సినేషన్‌పై తయారు చేసిన ఈ గీతాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాష్ ఖేర్ ఆలపించారు. ఢిల్లీ లోని శాస్త్రి భవన్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కైలాష్‌ఖేర్ కూడా పాల్గొన్నారు. జనవరి 16 న కేంద్రం కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతకాలం నెమ్మదిగా టీకాల పంపిణీ సాగినప్పటికీ ఇటీవల వేగం పుంజుకోంది. ఇప్పటివరకు 97 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. 69 కోట్ల కు పైగా మొదటి డోసు తీసుకున్నారు. 27 కోట్ల మంది రెండోడోసు తీసుకున్నారు. 73 శాతం మంది అర్హులకు ఇప్పటివరకు మొదటి డోసు అందినట్టు కేంద్రం ప్రకటించింది. 18, 19 లోగా వంద కోట్ల లక్షానికి చేరుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

https://www.youtube.com/watch?v=eQntspT0oOY

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News