Thursday, April 25, 2024

లాక్ డౌన్ పై మార్గదర్శకాలు విడుదల.. ఏప్రిల్ 20నుంచి వీటికి అనుమతి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ గైడ్ లైన్స్ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అన్ని రకాల విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసుల బంద్, లిక్కర్, గుట్కా, పొగాకు అమ్మకాలపై నిషేదం కొనసాగనుంది. ఏప్రిల్ 20 నుంచి వ్యవసాయ సంబంధ కార్యకలాపాలకు, ఉపాధి హామీ పనులకు కేంద్రం అనుమతినిచ్చింది. ఉపాధి హామీ కూలీలు సామాజిక దూరం పాటిస్తూ పనిచేయాలని సూచించింది. ఇక, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటిహెచ్, కేబుల్ సర్వీసులు, ఔషద పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఐటి సంస్థలు, ఐటీ సేవలకు 50 శాతం సిబ్బందితో నిర్వాహణకు, అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతినిచ్చింది. ఎలక్ట్రీషన్లు, ఐటీ రిటరేటర్లు, పంబర్లు, మోటార్ మెకానిక్, కార్పెంటర్ల సేవలకు అనుమతి. చమురు, గ్యాస్ అన్వేషణ, శుద్ధి కర్మాగారాలు, బొగ్గు ఉత్పత్తి గనులు, ఖనిజ ఉత్పత్తి, వాటి రవాణా.. పేలుడు పదార్ధాల సరఫరా, మైనింగ్ వంటి కార్యకలాపాలకు మినహాయింపునిచ్చింది.

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్మాణ ప్రాజెక్టుల్లో పనుల కొనసాగింపుకు అనుమతినిచ్చి.. సైట్ లో అందుబాటులో ఉన్న కార్మికులతో మాత్రమే ప్రాజెక్టులు చేపట్టాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటుక బట్టీల కార్యకలాపాలకు, రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతినిచ్చింది. వీటితోపాటు పట్టణ పరిధిలో లేని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు.. కాఫీ, తేయాకు తోటల్లో 50 శాతం సిబ్బందికి అనుమతినిచ్చింది. వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకిచ్చే సంస్థలకు, విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగు మందులకు, గోదాములకు, కోల్డ్ స్టేరేజీలకు అనుమతి ఇచ్చింది.  ఇక, హైట్ స్పాట్ లలో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని, పది అంతకన్నా ఎక్కువ  మంది గూమిగూడడం నిషేధించింది. అంత్యక్రియల్లో 20కి మించి ఎక్కువ పాల్గొనవద్దని, బయటకు వస్తే కచ్చితంగా మాస్క్ లు ధరించాలని.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్ కొనసాగనుంది.

Central Govt Releases Guidelines for Covid 19 Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News