Friday, March 29, 2024

కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్

- Advertisement -
- Advertisement -

Central govt serious note of the killing of elephant in Kerala

తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఘటనపై నివేదిక పంపించాలని కేరళ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశించింది. నేరస్థులపై గట్టి చర్యలు తీసుకుంటామని జవదేకర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు భారతీసంస్కృతి కాదన్నారు. ఏనుగు మృతి ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమైనట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దర్యాప్తు బృందాన్ని పాలక్కడ్ కు పంపామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సిఎం పోలీసులకు ఆదేశించారు.

కేరళలో ఏనుగు మృతిపై పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో గత నెల 27న ఏనుగు మృతి చెందింది. ఫైనాపిల్ లో బాంబు పెట్టి ఏనుగు మృతికి కారణమైన వారిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై రతన్ టాటా స్పందిస్తూ… అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటనను తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని రతన్ టాటా ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

ఈ అమానుష ఘటనపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణ్ దీప్ హుడా, తెలుగు నటి ప్రణీత భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ఈ దారుణ సంఘటపై హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా బహుమతి ప్రకటించింది. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ. 50వేలు ఇస్తామని ప్రకటనలో వెల్లడించింది.

Central govt serious note of the killing of elephant in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News