Thursday, April 25, 2024

నిజామాబాద్‌పై కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా

- Advertisement -
- Advertisement -

Central Intelligence Agency Focus on Nizamabad

రోహింగ్యాల పాస్‌పోర్ట్‌లపై ఆరా..!

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదులకు ఉన్న లింకులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. స్థానిక పోలీసుల, ఇంటిలిజెన్స్ అధికారుల నిఘా లోపం కారణంగా నిజామాబాద్‌లో అసాంఘీక శక్తులకు అడ్డాగా మారుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల బోధన్‌లో రోహింగ్యాలు అక్రమంగా పాస్‌పోర్ట్‌లు పొందటం, సౌదీ అరేబియాలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన బోధన్ నియోజకవర్గంలో సదరు వ్యక్తిని ఇంటిలిజెన్స్ నిఘా వర్గాలు అరెస్టు చేయడంపై కేంద్ర నిఘా వర్గాలు నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. బోధన్‌కు చెందిన యువకుడు సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకాలపాలకు పాల్పడటం తో జైలు జీవితం అనుభవించి, ఆపై సౌదీ అరేబియా పోలీసుల నిఘా నుంచి తప్పించుకొని బోధన్ చేరుకున్నాడు.

సౌదీ అరేబియా పోలీసుల పాస్‌పోర్ట్ సమాచారం మేరకు సదరు వ్యక్తి ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హైదరాబాద్ ఇంటిలిజెన్స్ పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ముంబైలో జరిగిన ఆలర్లతోపాటు హైదరాబాద్‌లో జరిగిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో జరిగిన బాంబు పేళ్లులతో నిజామాబాద్ జిల్లాకు లింకులున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు దృష్టికి వచ్చింది. అదేవిధంగా జిల్లాలో ఐఎస్‌ఐ,సిమి,ఐసిఎస్ తోపాటు పలు నిషేధ సంస్థలు పని చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉగ్రవాద దాడులలో పాల్గొని సాధరణ జీవితం అనుభవిస్తున్న వారి కదలికలపై స్థానిక పోలీసులు దృష్టి సారించలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో కరుడుగట్టిన ఉగ్రవాది అజాంఘోరీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన విషయం విదితమే. బోధన్‌లో సైకిల్ వ్యాపారిని హత్య కేసులో ఏడుగురు జైలు పాలుకగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు వారి అచూకీ దొరకలేదు.

అజంఘోరీజగిత్యాలలో ఎన్ కౌంటర్, సారంగాపూర్ కు చెందిన యువకుడు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్‌ఐ తో మాట్లాడుతూ పోలీసులకు చిక్కడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. జిల్లా కలెక్టరేట్ వద్ద నిషేదిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు ధర్నా చేయగా వారి అదుపులోకి తీసుకొని, కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పోలీసుశాఖలో పని చేస్తున్న ఉద్యోగి ఇంటి ఆడ్రస్ నుంచి బంగ్లాదేశ్ లోని రోహింగ్యాలకు 120 పాస్‌పోర్ట్ లు జారీ అయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా పాస్‌పోర్ట్ లు కూడా వచ్చాయి. ఈక్రమంలో రోహింగ్యాల నుంచి ఎన్ని పాస్‌పోర్ట్ లు స్వాధీనం చేసుకున్నారు, ఎంత మందిని అరెస్టు చేశారన్న దానిపై స్థానిక పోలీసులు ప్రకటించకపోవడం పై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేక దృష్టిసారించడంతో పాటు దర్యాప్తు చేపడుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News