- Advertisement -
హైదరాబాద్: ఈ నెల 15న ఢీల్లిలో జరుగనున్న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సమావేశానికి హాజరు కావలసిందిగా రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావుకు కేంద్రం నుండి ఆహ్వానం వచ్చింది. భేటీలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద చేపట్టిన ప్రాజెక్టులపై చర్చ జరగనుందని సమాచారం. దీంతోపాటు 99 సాగునీటి పథకాలు, అవసరమైన నిధులపై సమావేశంలో నేతలు చర్చించనున్నారట.
- Advertisement -