Home జాతీయ వార్తలు ఏదీ ‘ఫ్రీ’గా రాదంటున్న కేంద్రం!

ఏదీ ‘ఫ్రీ’గా రాదంటున్న కేంద్రం!

Kerala Floods

న్యూఢిల్లీ: తుపాను తాకిడికి ఘోరంగా దెబ్బతిన్న కేరళలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం మరో రూ 2,500 కోట్లు సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అయితే, తుపాను బాధితుల సహాయార్థం తాము పంపిన హెలికాప్టర్లకు, ఆహార పదార్థాలకు రూ 290 కోట్లు వెనక్కు పంపాలని కేంద్రం మెలికపెట్టింది. మూడు నెలల క్రితం కేరళలోని 14 జిల్లాలను గడ గడ లాడించిన వరదలకు 483 మంది మరణించారు. అప్పట్లో తక్షణ సహాయంగా కేంద్రం రూ 600 కోట్లు ప్రకటించింది. అయితే, కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం మాత్రం తుపాను నష్టం భారీగా ఉందని, కనీసం రూ 4800 ఆర్థిక సహాయం అవసరమని కేంద్రానికి వినతిపత్రం అందచేసింది.

కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ సారథ్యంలోని కమిటీ కేరళకు రూ 2500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదించిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్‌తో కలసి ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. బాధితుల కోసం ఉపయోగించిన హెలికాప్టర్లు, ఆహార పదార్థాల ఖర్చుల నిమిత్తం రూ 290 కోట్లు వెనక్కు పంపాలన్న కేంద్రం ఆదేశాల గురించి ముఖ్యమంత్రి విజయన్ గురువారం అసెంబ్లీలో వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన రూ 2700 కోట్ల విరాళాలు కూడా తుపాను సహాయక చర్యలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆయన వాపోయారు.

Centre Agrees To Give Rs 2500 cr to Kerala

Telangana Breaking News

Centre Agrees To Give Rs 2500 cr to Kerala, Asks to Return Back Rs 290 Cr for Centre Relief Measures, Pinarayi Vijayan Asks For Rs 4,800 Cr