Saturday, April 20, 2024

రీజనల్ రింగ్‌రోడ్డు సాకారం కాబోతోంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ వాసుల చిరకాల వాంఛ అయిన రీజనల్ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు. దీనిపై రాష్ట్ర వికాసం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సోమవా రం రాష్ట్ర బిజెపి నేతలతో కలిసి ఆయన కేంద్ర రోడ్డు, రవా ణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. ఈ సందర్భం గా ప్రధానంగా రీజనల్ రింగు రోడ్డుపై చర్చించారు. అనంతరం మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమో దం తెలిపిందన్నారు. రెండు దశల్లో కలిపి సుమారు రూ. 17 వేల కోట్లతో కేంద్రం రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మించబోతోందని ఆయన పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫి క్ కష్టాలు తీరడంతో పాటు 20 పట్టణాలకు రింగురోడ్డు ఉపయుక్తం కానుందన్నారు. నూతన పెట్టుబడులు, రియ ల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధితో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ వేగంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు వస్తే 40శాతం మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఇప్పటికే హైదరాబాద్ రింగ్ రోడ్డు నగరానికి మంచి పేరు తెచ్చిపెట్టిందని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఇంతకుముందు ఉన్న రింగ్ రోడ్డుకు రిజనల్ రింగ్ రోడ్డు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు. సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు మొదటి దశలో పనులు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 158 కిమీ మేర రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. దీనిని ఎన్‌హెచ్ 161 ఎఎగా కేంద్రం గుర్తించిందని ఆయన తెలిపారు. సుమారుగా రూ. 9,522 కోట్ల నిర్మాణ వ్యయంగా నిర్ణయించారన్నారు. హైదరాబాద్‌కు దక్షిణ వైపున రీజనల్ రింగ్ రోడ్డుకు విజ్ఞప్తి చేశామన్నారు.
రెండో దశ చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు మంజూరు చేయాలని కోరామన్నారు. వీలైనంత త్వరగా దీనిని ఆమోదించాలని కోరామన్నారు. దీనిపై 182 కిలో మీటర్ల రహదారి కోసం రూ. 6,881 కోట్లు పైగా ఖర్చు చేయనున్నారన్నారు. దీంతో రెండు దశల్లో కలిపి రూ. 17 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తవుతుందన్నారు. హైదరాబాద్‌కు వచ్చే అన్ని హైవేలను కలుపుతూ ఈ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డుతో లాజిస్టిక్ పార్కులు కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే వ్యవసాయ, ఉపా ధి, పరిశ్రమలు, ఐటి రంగాల అభివృద్ధి, పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణతో పాటు పలువురు రాష్ట్ర నేతలు ఉన్నారు.

Centre approves RRR Road in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News