Friday, April 19, 2024

నకిలీ టీకాలపై కేంద్రం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Centre issues guidelines to detect fake vaccines

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్లు అందుబాటు లోకి వస్తుండగా మరో వైపు నకిలీ టీకాలు మార్కెట్ లోకి ప్రవేశిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలనే ప్రపంచ ఆరోగ్యసంస్థ వీటిపై హెచ్చరించగా కేంద్ర ప్రభుత్వం టీకాల ప్రామాణికతపై రాష్ట్రాలకు అనేక సూచనలు చేసింది. కొవిషీల్డ్‌కు చెందిన నకిలీ టీకాలు ఆసియా, ఆఫ్రికా, మార్కెట్ లోకి వచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. వీటితోపాటు దేశం లోనూ అనేక చోట్ల టీకాలు వాడుకలో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్రం ముందు జాగ్రత్త చర్యగా టీకా అసలైనదా ? నకిలీదా అని తెలుసుకోడానికి రాష్ట్రాలకు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ , స్పుత్నిక్ వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి ఆయా బాటిళ్లపై లేబుల్, రంగుతోపాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియచేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది.

కొవిషీల్డ్

ఎస్‌ఐఐ (సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ) పేరుతో లేబుల్
కొవిషీల్డ్ బ్రాండ్ పేరు.. ట్రేడ్ మార్కు (టిఎం) గుర్తు
సాధారణ ఫాంటులో ( బోల్డ్‌లో కాకుండా ) జనరిక్ (సాంకేతిక పేరు) పేరు
జనరిక్ పేరు కింద బ్రాకెట్‌లో అదే ఫాంటులో ‘recombinant’
స్టిక్కర్ పైన ఎరుపు రంగులో cgs : not for sale అనే స్టాంపు
ముదురు ఆకుపచ్చ రంగులో లేబుల్ , దానిపైన తెలుపు రంగులో ముద్రించిన అక్షరాలు
ఆకుపచ్చ రంగులో అల్యూమినియంతో కూడిన బాటిల్ మూత

కొవాగ్జిన్

లేబుల్ పైన డిఎన్‌ఎ మాదిరిగా కనిపించే గుర్తులు ( అతినీల లోహిత కిరణాలతో మాత్రమే కనిపించే వీలు )
టేబుల్ మీద అతిచిన్న చుక్కల రూపంలో కొవాగ్జిన్ అనే పేరు
covaxin పేరులో x అక్షరం తొలి సగభాగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
covaxin హోలో గ్రామ్

స్పుత్నిక్ వి

రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశీయం గానే తయారవుతోంది.
రెండు బాటిళ్ల డిజైన్, వాటిపై సమాచారం మాత్రం ఒకటే.
తయారీ సంస్థ పేరు మాత్రం వేర్వేరు
టీకా బాక్సు (ఒకో దాంట్లో 5 ఇంజెక్షన్ సీసాలు ) ముందు, వెనుక భాగాల్లో సమాచారం ఇంగ్లీష్ లోనే ఉంటుంది.
సీసా లేబుల్‌పై మాత్రం రష్యాభాషలో సమాచారం.
ఈ విధంగా ఆయా తయారీ సంస్థల సమాచారం వయల్స్, రంగు, ట్రేడ్ మార్కుతోపాటు లేబుల్‌పై కొన్ని ప్రత్యేక గుర్తులు బట్టి అసలైన బాటిల్‌ను తేలికగా గుర్తించ వచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News