Home తాజా వార్తలు పెట్టుబడుల ఉపసంహరణతో రూ.12,995 కోట్లు

పెట్టుబడుల ఉపసంహరణతో రూ.12,995 కోట్లు

Disinvestment

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఇప్పటివరకు రూ.12,995 కోట్లు ప్రభు త్వం అందుకుంది. దీనిలో ఐఆర్‌సిటిసి ఐపిఒ నుంచి రూ.638 కోట్లు వచ్చాయి. కాగా 2019 -20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల నుండి రూ 1.05 లక్షల కోట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల నుండి వచ్చి న సమాచారం ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం వెల్లడించింది. ఐఆర్‌సిటిసి ఐపి ఒ తేవడానికి ముందు పెట్టుబడుల ఉపసంహర ణ ద్వారా ప్రభుత్వానికి రూ. 12,357.49 కోట్లు వచ్చాయి. ఈ సంవత్సరం మొదటిసారిగా లిస్ట్ చేసిన సంస్థలలో ఐఆర్‌సిటిసి పనితీరు చాలా ఆకర్షణీయంగా ఉంది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం ఐఆర్‌సిటిసి షేర్లు రూ.874 వద్ద ముగిశాయి. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ .14,000 కోట్లకు పెరిగింది. పబ్లిక్ ఆఫర్ ద్వారా ఈ సంస్థ రూ.5,120 కోట్లు సమీకరించింది. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్‌లో 25 శాతం వాటాను ఐపిఒ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జనవరి మధ్యలో ఈ ఐపిఒ మార్కెట్లోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బిపిసిఎల్‌లో ప్రభు త్వ 53.29 శాతం వాటాను విక్రయించడంతో 57,000 కోట్ల రూపాయలు సేకరించవచ్చు. ఇది పెట్టుబడుల ఉపసంహరమ లక్ష్యంలో 53.5 శాతం ఉంటుంది.

Centre proceeds from divestment stand at Rs 12,995 cr