Home తాజా వార్తలు టాటా సన్స్‌తో ప్రభుత్వం వాటా కొనుగోలు ఒప్పందం

టాటా సన్స్‌తో ప్రభుత్వం వాటా కొనుగోలు ఒప్పందం

Centre signs share purchase agreement with tata sons

 

న్యూఢిల్లీ : టాటా సన్స్‌తో వాటా కొనుగోలు ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.18 వేల కోట్లకు ప్రభుత్వరంగ విమాన సంస్థ ఎయిర్ ఇండియాను విక్రయించే విషయమై ఈ ఒప్పందం జరిగింది. గత నెలలో టాటా సన్స్ అనుబంధ సంస్థ టలాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బిడ్‌ను గెలిచిన టాటా సన్స్ రూ.15,300 కోట్లు అప్పు బాధ్యతను తీసుకుంటుంది. ఇక నగదు రూపంలో రూ.2700 కోట్లను చెల్లించనుంది. ఎయిర్ ఇండియా సంస్థలో టాటా గ్రూప్‌నకు 100 శాతం వాటా విక్రయానికి సంబంధించి ఎల్‌ఒఐ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)ను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించినట్టుగా ప్రభుత్వం ధృవీకరిస్తూ టాటా సంస్థకు ఎల్‌ఒఐను జారీ చేశామని డిఐపిఎఎం కార్యదర్శి తుహిన్ కాంత పాండే ప్రకటించారు. సాధారణంగా ఎల్‌ఒఐ, ఎస్‌పిఎ ఒప్పందానికి 14 రోజుల్లో ఆమోదిస్తారు. అయితే వేగంగా పనులు చేపట్టామని పాండే వివరించారు. డిసెంబర్ ఆఖరు నాటికి ఒప్పందం ప్రక్రియ పూర్తి చేయాలని లక్షంగా చేసుకున్నామని అన్నారు.

Centre signs share purchase agreement with tata sons