Thursday, March 28, 2024

కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇవ్వాలి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Centre to buy vaccine for all states: Kejriwal

న్యూఢిల్లీ: కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకిది సమయం కాదని ఆయన హితవు పలికారు. దేశం కరోనా వైరస్‌తో వణికిపోతున్నవేళ ఒకరినొకరు నిందించుకోవడం తగదన్నారు. ప్రపంచమంతా దీనికి పరిష్కారం వ్యాక్సిన్లే అని గుర్తించిన తర్వాత ఇంకా చర్చ అవసరం లేదన్నారు. శనివారం ఛత్రసాల్ స్టేడియంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 450 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. తాజాగా 24 గంటల్లో కేసుల సంఖ్య 956కు దిగిపోయింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి నిర్మాణ పనులు, పరిశ్రమలు ప్రారంభం కానున్నట్టు కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆయన గుర్తు చేశారు.

Centre to buy vaccine for all states: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News