Home తాజా వార్తలు కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త క్రిప్టోకరెన్సీ బిల్లు

కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త క్రిప్టోకరెన్సీ బిల్లు

Centre to introduce new crypto bill in parliament

 

రాజ్యసభలో ఆర్థికమంత్రి నిర్మల వెల్లడి

న్యూఢిల్లీ : కొత్త క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం పనులు జరుగుతున్నాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరుగుతాయి. క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు 2021ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ద్వారా అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించేందుకు తగిన వెసులుబాటు కల్పించే దిశగా బిల్లును సిద్ధం చేయనున్నారు.

ఇది భారతదేశంలో ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించి, కొన్నింటి మినహాయింపు ఇవ్వనుంది. కొత్త బిల్లును మనీ లాండరింగ్ నిరోధక చట్టం2002 కింద అనేక విషయాలను పరిశీలిస్తున్నామని సీతారామన్ వివరించారు. కొత్త బిల్లులో ఎన్‌ఎఫ్‌టి (నాన్ ఫంగిబుల్ టోకెన్) రెగ్యులేషన్ విషయంపైనా ప్రభుత్వం చర్చించిందని, క్రిప్టోకరెన్సీతో నిర్వహించే కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రకటనలపై నిషేధం విధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అయితే ఆర్‌బిఐ, సెబీ ద్వారా ప్రజలను జాగృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆమె వివరించారు.

Centre to introduce new crypto bill in parliament