Home తాజా వార్తలు సీతారామ ప్రాజెక్టుకు అటవీ భూములు

సీతారామ ప్రాజెక్టుకు అటవీ భూములు

 

Centre to permits Environmental for Sitarama Project

 

సీతారామ ప్రాజెక్టుకు అటవీ భూములు అప్పగిస్తూ కేంద్రం జిఒ విడుదల
పర్యావరణ అనుమతులు కూడా మంజూరు

మన తెలంగాణ/హైదరాబాద్: సమ్మక్క బ్యారేజ్(సీతారామ ప్రాజెక్టు) నిర్మాణం కోసం 27.9 హెక్టార్లు(68.9 ఎకరాలు) భూమిని తెలంగాణ నీటిపారుదల శాఖకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటిని సరఫరా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సమ్మక్క బ్యారేజి పేరుతో నిర్మాణం తలపెట్టింది. దీనికోసం ములుగు మండలం ఏటూరు నాగారం, వెంకటాపురంలో అటవీ భూమి సేకరించడం అవసరం అయింది. దీంతో రాష్ట్ర ప్రభు త్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ప్రభుత్వం ఆ భూ మిని కేంద్ర అటవీ శాఖకు బదలాయించింది. కేంద్ర అటవీ శాఖ ఈ భూములను రాష్ట్ర నీటి పా రుదల శాఖకు బదిలీ చేసింది. దీంతో పాటు బ్యా రేజ్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

Centre to permits Environmental for Sitarama Project