Home తాజా వార్తలు ఓటు హక్కుపై కోటి లేఖలు

ఓటు హక్కుపై కోటి లేఖలు

CEO Rajat Kumar

కోటి కుటుంబాలకు రాస్తున్నాం : రజత్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు కోటి లేఖలు రాయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కు మార్ తెలిపారు. ‘ఓటు మీ హక్కు. ఓటు వేయడం మీ బాధ్యత’ అనే ని నాదంతో ఆ లేఖలో ఓటు హక్కు న మోదు చేసుకోవడం ఎలా, ఓటు ను ఒక చోటు నుంచి మరొక చోటుకి మార్చుకోవడం, తొలగింపులు వంటి వాటి వివరాలను తెలియపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. లేఖ అందిన తరువాత ఎదుటి వారు తమ సమస్యను తన కార్యాలయ అడ్రస్ (సిఇఒ)కు పంపేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఓటర్ల మొబైల్స్‌కు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు కూడా ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజత్ కుమార్ మాట్లాడుతూ, తాము డిలీట్ చేసిన ఓటర్లలో 95 శాతం సరియైనవేనన్నారు.

మేడ్చల్ జిల్లాల్లో 7.40 లక్షల ఓటర్లను తొలగిస్తే, అందులో 6.80 లక్షలు సరైన తొలగింపులేనని స్పష్టమైందన్నారు. మిగతా 60 వేల ఓటర్ల తొలగింపుపై కూడా వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. పైలట్ రివ్యూలో భాగంగా మేడ్చల్ జిల్లాలో చేశామని, మిగతా అన్ని జిల్లాల్లోనూ ఇలాగే చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2015, 2016లలో జాతీయ స్థాయిలో జరిగిన ఓటరు సవరణ కార్యక్రమంలో రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు వివరించారు. ఈ విషయం ఆ ఓటర్లకు తెలియక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లి జాబితాలో పేరు లేదని వెనక్కి వచ్చారన్నారు. ఒక్కసారి ఫైనల్ జాబితా ప్రకటించిన తరువాత ఓటరును తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. డబుల్ ఎంట్రీ ఓటర్లను అందుకే తొలగించలేకపోయామని వివరించారు.

తొలగింపు ఓటర్లలో కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని, వాటిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిహెచ్‌ంఎసి పరిధిలో ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు తాఖీదులు పంపినట్లు చెప్పారు. అర్హత ఉండి కొందరు మళ్లీ నమోదు చేసుకోవడంలో నిర్లక్షం చూపారన్నారు. అలాగే తాము తగిన సౌకర్యాలను కూడా గతంలో కల్పించలేకపోయామని సిఇఒ రజత్ కుమార్ ఒప్పుకున్నారు. అందులో భాగంగానే ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైందని అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు నమోదుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 8.64 లక్షలుగా ఉందన్నారు. తొలగింపులకు 57,348 దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగతా వాటితో కలిపి మొత్తం 9,54,827 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

జనవరి 25వ తేదీ వరకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరిస్తామని, తుది జాబితాను ఫిబ్రవరి 22వ తేదీన ప్రకటిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఎంఎల్‌సి ఎన్నికలపై దృష్టి సారించినట్లు రజత్ కుమార్ వివరించారు. ఈ నెల 21వ తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 20వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు 1.42 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. టీచర్ ఎంఎల్‌సికి 33.08 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. మరింత సమయం ఉన్నందున ఈ ఓటర్ల నమోదుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

CEO Rajat Kumar Stresses To Enroll Names in Voters List