Tuesday, April 16, 2024

వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ యూనివర్సిటీల ప్రవేశాలకు సెట్: యుజిసి

- Advertisement -
- Advertisement -

CET for UG, PG courses in central universities

న్యూఢిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని యుజి,పిజి కోర్సులకు 2022-2023 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)ను నిర్వహించనున్నట్టు యుజిసి తెలిపింది. 13 భాషల్లో సెట్ నిర్వహించనున్నట్టు యుజిసి తెలిపింది. ఇప్పటికే ఎన్‌టిఎ ఆధ్వర్యంలో జెఇఇ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. పిహెచ్‌డి ప్రవేశాల విషయంలోనూ జాతీయస్థాయి పరీక్ష నెట్‌లో వచ్చిన మార్కుల్ని పరిగణనలోకి తీసుకుంటారని యుజిసి తెలిపింది. సెట్‌ను ఆసక్తి ఉన్న రాష్ట్రాలు, ప్రైవేట్‌సహా అన్ని యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకోవచ్చునని యుజిసి సూచించింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపి)2020కి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యుజిసి గుర్తు చేసింది. సెట్‌ను విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, భాషా శాస్త్రాల కోర్సులకు నిర్వహించనున్నారు. సెట్ నిర్వహణ కోసం ఏర్పాటైన కమిటీ నవంబర్ 21న అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లతో సమావేశం నిర్వహించి, వారి నుంచి సూచనలు తీసుకున్నట్టు యుజిసి తెలిపింది. కేంద్ర విద్యాశాఖ 2021 నుంచే సెట్ నిర్వహిస్తామని ప్రకటించగా, కొవిడ్ ఉధృతి వల్ల అది ఆచరణసాధ్యం కాలేదని యుజిసి పేర్కొన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News