Home తాజా వార్తలు వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్

Chain Snatchingహైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా పరిధిలో మళ్లీ చైన్ స్నాచర్లు విజృంభిస్తున్నారు. వనస్థలిపురం ఎఫ్‌సిఐ కాలనీలో ఓ మహిళ మెడ నుంచి దుండగులు నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరగకుండా పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచర్లు విజృంభిస్తున్నారు. దీంతో మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Chain Snatching At Vanasthalipuram In Rangareddy