Wednesday, April 24, 2024

ఐలమ్మ జయంతి, వర్థంతిలను అధికారికంగా నిర్వహిస్తాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళాచైతన్యానికి ప్రతీకగా నిలిచిన, చిట్యాల (చాకలి) ఐలమ్మ 126వ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తిని స్మరించుకున్నారు. అత్యంత వెనకబడిన కులం (ఎంబిసి)లో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అని సిఎం కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి ఇమిడి ఉందన్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News