Home సినిమా ఘనవిజయం దిశగా ‘ఛల్ మోహన్‌రంగ’

ఘనవిజయం దిశగా ‘ఛల్ మోహన్‌రంగ’

nitinనితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన  శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్, త్రివిక్రమ్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ “16 ఏళ్లలో 25 సినిమాలు చేశాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో కెరీర్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాను. కామెడీ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ‘ఛల్ మోహన్‌రంగ’ సక్సెస్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో సినిమాకు మంచి స్పందన వస్తోంది. దర్శకుడు కృష్ణచైతన్య డైలాగ్స్, కామెడీ వల్ల సినిమా హిట్ అయింది. రెండున్నర గంటల పాటు హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేసే చిత్రమిది”అని అన్నారు. దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ “పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. సినిమాలో నితిన్, మేఘాఆకాష్ అద్భుతంగా నటించారు. నరేష్, రావు రమేష్ సహా అందరూ చక్కగా చేశారు. నిర్మాతలు పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డిలు నాకు పూర్తిగా సహకరించారు”అని తెలిపారు. నరేశ్ మాట్లాడుతూ “సినిమాలో కొత్త ఫ్లేవర్‌తో నా పాత్ర కొనసాగుతుంది. ఇందులో ఆద్యంతం కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ మంచి చిత్రమిది”అని చెప్పారు. ఈ సమావేశంలో మేఘాఆకాష్, సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డితో పాటు చిత్ర బృందం పాల్గొంది.