Home తాజా వార్తలు విజువల్ ట్రీట్‌లా ‘ఛలో ప్రేమిద్దాం’

విజువల్ ట్రీట్‌లా ‘ఛలో ప్రేమిద్దాం’

'Chalo Premiddam' movie as a visual treat

హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆవిష్కరణ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని మాట్లాడుతూ… ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూశాక విజువల్ ట్రీట్‌లా సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. అంతా యంగ్ టీమ్ పని చేశారు. భీమ్స్ ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా మంచి పాటలు ఇచ్చారు. అని అన్నారు. చిత్ర దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ… సాయి రోనక్ పెద్ద హీరో అవుతాడు. శశాంక్ చాలా మంచి పాత్ర పోషించాడు. త్వరలో పాటలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అని తెలిపారు. చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ… నవంబర్ నెలాఖరులో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, డాన్స్ మాస్టర్ వెంకట్ దీప్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, హీరో సాయి రోనక్, శశాంక్, సురేష్ గంగుల, దేవ్‌తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.