Home ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం

ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం

  • నేటి నుంచి మినీ ప్రపంచకప్

ICC-CT-17

లండన్: ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. గురువారం ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్ జూన్ 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. గురువారం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నమెంట్‌కు తెరలేవనుంది. ఇంగ్లాండ్, వెల్స్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ఈ మినీ ప్రపంచక ప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూ ప్-ఎలో ఆతిథ్యం ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌తో పాటు మాజీ ఛాంపియన్లు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. లీగ్ దశలో గ్రూపులో ఉన్న జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు జరుగుతున్నాయి. ప్రతి గ్రూపు నుం చి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహి స్తున్నారు. కెన్నింగ్‌టన్ ఓవల్, ఎడ్జ్‌బస్టన్, సోఫియా గార్డెన్స్ మైదానాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరు గుతాయి. మొదటి సెమీఫైనల్ జూన్ 14న సోఫియా గార్డెన్స్‌లో, రెండో సెమీఫైనల్ జూన్ 15న ఎడ్జ్‌బస్టన్‌లో జరు గనుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 18న కెన్నింగ్‌టన్ ఓవల్‌లో జరుగనుంది. కాగా, ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండేసి సార్లు విజేతగా నిలి చాయి. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒక్కోసారి ట్రోఫీని గెలుచుకున్నాయి. ఇంగ్లాండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించలేదు.
ఆస్ట్రేలియా, భారత్‌లే ఫెవరేట్…
మరోవైపు ప్రస్తుత ఛాంపియన్ టీమిండియా, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ట్రోఫీ కోసం పోరా టం జరుగుతుందని విశ్లేషకులు అంచన వేస్తున్నారు. రెండు జట్లు కూడా వన్డేల్లో మెరుగైన ప్రతిభను కనబ రుస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా ఎదురులేని శక్తిగా కొనసాగుతోంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకూ డా వన్డేల్లో అసాధారణ రికార్డును కలిగివుంది. ఇరు దేశాలు ఫైనల్‌కు చేరుకుంటాయని విశ్లేషకులు అంచన కువచ్చారు. అయితే ఆతిథ్య ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల ను కూడా తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన ఆటగా ళ్లు ఇరు జట్లలో ఉన్నారు. న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా బలంగా ఉన్నాయి. సంచలనాల పాకిస్థాన్ ను కూడా తక్కవ అంచన వేసే పరిస్థితి లేదు. అయితే బం గ్లాదేశ్ మాత్రమే కాస్త బలహీనంగా ఉంది. అయితే ఇత ర జట్ల ఫలితాలను ప్రభావం చేసే సత్తా ఆ జట్టుకు ఉంది.

నేడు బంగ్లాతో ఇంగ్లాండ్ తొలి పోరు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆసియా జట్టు బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను గెలిచిన ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం చవిచూడడం ఇంగ్లాండ్ కలవర పరుస్తోంది. మరోవైపు భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ కూడా ఆత్మస్థై ర్యాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును ఓడించాలంటే బంగ్లా అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అయితే జట్టులో ప్రతి భావంతు లైన ఆటగాళ్లకు కొదవలేదు. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఇమ్రూల్ కైస్, ముష్ఫి కుర్ రహీం, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, సౌమ్య సర్కార్, సాకిబ్ అల్ హసన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఎటువంటి బ్యా టింగ్ లైనప్‌నైన చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన ముస్త ఫిజుర్ రహ్మాన్, మశ్రఫె ముర్తుజా, సున్జాముల్ ఇస్లాం వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టుకు అందు బాటులో ఉన్నారు. ఇక, సాకిబ్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ను తక్కువ అంచన వేయలేం.

ఇక, ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగు తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమా రు చేసే ఆటగాళ్లు ఇంగ్లాండ్‌కు అందుబాటులో ఉన్నారు. సౌతా ఫ్రికాపై మెరుపులు మెరిపించిన కెప్టె న్ ఇయాన్ మోర్గాన్ ఈసారి కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. అలెక్స్ హెల్స్, బైర్‌స్టో, జోస్ బట్లర్, రూట్, జాసన్ రాయ్, జాక్ బాల్ వంటి అగ్రశ్రేణి బ్యా ట్స్‌మెన్ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు. ఇక, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ వంటి ప్రతిభావంతులైన ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. స్టోక్స్, వోక్స్‌లు చెలరే గితే ఇంగ్లాండ్‌కు విజయం నల్లేరుపై నడకే.
జట్ల వివరాలు
ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బైర్‌స్టో, జాక్ బాల్, శామ్ బిల్లింగ్స్, అలె క్స్ హెల్స్, జోస్ బట్లర్, లియామ్ ప్లుంకెట్, ఆదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవి డ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
బంగ్లాదేశ్: తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ఇమ్రూ ల్ కైస్, ముష్ఫికుర్ రహీం, సాకిబ్ అల్ హసన్, షబ్బీ ర్ రహ్మాన్, మహ్మదుల్లా, మోసదెక్ హుస్సేన్, మశ్రఫే ముర్తుజా (కెప్టెన్), ముస్తఫిజుర్ రహ్మాన్, రుబేల్ హు స్సేన్, తస్కిన్ అహ్మద్, సున్జాముల్ ఇస్లాం, మెహది హసన్, షఫివుల్ ఇస్లాం.