Wednesday, April 24, 2024

చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు

- Advertisement -
- Advertisement -

Chandigarh Airport to be renamed after Bhagat Singh: PM Modi

న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్‌సింగ్ పేరు పెడుతున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రకటించారు. ఆదివారం 93వ మన్‌కీబాత్ రేడియో కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి ఈ నెల 28 న జరగనుండటంతో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.“ప్రియమైన దేశ వాసులారా మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 28న అమృత్‌మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్‌సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్‌సింగ్‌కు నివాళిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెడుతున్నాం.” అని మోడీ ప్రకటించారు.

సముద్ర పర్యావరణ వ్యవస్థకు వాతావరణ మార్పులు ప్రధానమైన ముప్పుగా ఉన్నట్టు ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. బీచ్‌ల్లో చెత్త చేరుతోందని, దీన్ని సీరియస్‌గా తీసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని తన ప్రసంగంలో బీజేపీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళులు అర్పించారు. ఆయన గొప్పమేథాశక్తి కలవారని, భరతమాత ప్రియపుత్రుడని కొనియాడారు. చీతాలు తిరిగి రావడంపై 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగి పోతున్నాయని, చీతాలను ఎప్పటికప్పుడు ఒక టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షిస్తుందని, వాటిని జనం ఎప్పుడు చూసేందుకు అవకాశం ఉంటుందో టాస్క్‌ఫోర్స్ నిర్ణయిస్తుందని చెప్పారు.

Chandigarh Airport to be renamed after Bhagat Singh: PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News