Friday, April 19, 2024

చంద్రబాబు బినామీల రాజధాని అమరావతి: సురేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పెత్తందార్లతో పోరాడి పేదలను గెలిపిస్తున్న నాయకుడు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. 45 వేల మంది పేదల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. మూడు రాజధానులు అనేది అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్షమన్నారు. అమరావతిలో చంద్రబాబు అక్రమాలు, అవినీతిపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ఇడి, సిబిఐ కూడా విచారణ జరిపే అవకాశం ఉందన్నారు. టిడిపి నేతలు చంద్రబాబు, లోకేష్ కచ్చితంగా జైలుకెళ్తారన్నారు.

Also Read: సన్‌రైజర్స్ రాత మారేనా?.. నేడు రాజస్థాన్ తో కీలక పోరు

అమరావతిని చంద్రబాబు తన బినామీల రాజధానిగా మార్చుకున్నారని సురేష్ ఆరోపణలు చేశారు. టిడ్కో ఇళ్లపై చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. చంద్రబాబు టిడ్కో వేరు… తాము ఇస్తున్న టిడ్కో ఇళ్ల స్కీమ్ వేరని చెప్పారు. పేదలపై రూ.14 వేల కోట్ల భారం లేకుండా చేశామని, టిడ్కో ఇళ్ల అవినీతిపై కూడా విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. దళితులను గతంలో చంద్రబాబు, లోకేష్ కించపరిచారని దుయ్యబట్టారు. టిడిపి కార్యకర్తలే తన క్యాంపు ఆఫీస్‌పై దాడి చేశారని ధ్వజమెత్తారు. దాడి చేస్తామని కవ్వించారని… అందుకే చొక్కా తీసి సవాల్ చేశానన్నారు. తనకు మూలాలు లేవని చంద్రబాబు అవమానించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News