Home తాజా వార్తలు బాబుకు ఓటమి తప్పదు: కెటిఆర్

బాబుకు ఓటమి తప్పదు: కెటిఆర్

KTR vs Chandra babu Naidu

 

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఓటమి తప్పదని అర్ధమైందని ట్విట్టర్‌లో కెటిఆర్ జోస్యం చెప్పారు. అందుకే బాబు, ఆయన అడుగులకు మడుగులొత్తే పచ్చ మీడియా సంస్థలు సాకులు వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయని చురకలంటించారు. చంద్రబాబు మొదలు పెట్టిన యాక్షన్‌లో భాగంగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు టిడిపికి ఎలాంటి లాభం చేకూర్చవని వెల్లడించారు. ఎపి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముగిసిన అనంతరం ఎన్నికల కమిషన్‌పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవిఎంలను రిపేర్ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారని బాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Chandra Babu Naidu Defeat in Assembly Elections: KTR