గుంటూరు: ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చిన ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీంతో పోలీసులు తీరుపై, వైసిపి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ దీక్షలకు దిగాలని ఈ సందర్భంగా టిడిపి నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఛలోఆత్మకూరుకు టీడీపీ పిలుపు ఇవ్వడంతో ఎపిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై పోలీసులు నిషేధం విధించారు. దీంతో టిడిపి నేతలను, కార్యక్తలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్నారు. నారా లోకేష్‌ను కూడా పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
Andhra Pradesh: TDP leaders and workers who were trying to go to Chandrababu Naidu's residence stopped by police and taken into preventive custody. pic.twitter.com/Ionmrkf9CR
— ANI (@ANI) September 11, 2019
chandrababu Naidu fires on Police and YCP Govt