Home అంతర్జాతీయ వార్తలు చంద్రయాన్-2 : నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్ వి

చంద్రయాన్-2 : నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్ వి

Chandrayaan-2శ్రీహరికోట :  అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో శోధించే ఉద్దేశంతో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం సోమవారం మధ్యాహ్నం విజయవంతంగా జరిగింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జిఎస్ఎల్ వి మార్చ్3ఎం1 వాహకనౌకను నింగిలోకి పంపారు.  సోమవారం  మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఈ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ ప్రయోగం ద్వారా జిఎస్ఎల్ వి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లిందని సైంటిస్టులు చెప్పారు. రాకెట్ బరువు 640 టన్నులని  సైంటిస్టులు తెలిపారు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్ తో రాకెట్ పయనించనుందని వారు వెల్లడించారు. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ  ప్రయోగానికి రూ. 978 కోట్లు వ్యయం చేశామని, ఈ ప్రయోగాన్ని యావత్ విశ్వం ఆసక్తితో తిలకించిందని వారు చెప్పారు.

చంద్రయాన్-2ను విజయవంతంగా కక్ష్యలోకి పంపించినట్టు ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. మొన్నటి ప్రయోగంలో తలెత్తిన సాంకేతిక సమస్యను గుర్తించి ప్రయోగాన్ని ఆపివేశామని ఆయన తెలిపారు. లోపాన్ని సరిచేసి సోమవారం జిఎస్ఎల్ విని విజయవంతంగా ప్రయోగించామని ఆయన చెప్పారు.  ఈ ప్రయోగంతో మార్క్3 రాకెట్ పనితీరు 15 శాతం పెరిగిందని చెప్పారు. మార్క్3 విజయం ఇస్రో సైంటిస్టుల్లో  ఆత్మవిశ్వాసాన్ని  పెంచిందని తెలిపారు. ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్ర్తో సైంటిస్టులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. చంద్రుడి ఉత్తర ధృవంపై రోవర్ ను విజయవతంగా దింపుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్ఎల్ విని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో సైంటిస్టులను రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అభినందించారు.

 Chandrayaan-2 : GSLV Experiment Success