Thursday, March 28, 2024

బ్యాంకుల పనివేళల్లో మార్పులు

- Advertisement -
- Advertisement -

Banks

 

హైదరాబాద్ : కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాలుగు గంటల పాటే విధులు నిర్వహించాలని నిర్ణయించాయి. కరోనా వైరస్ ప్రభావంతో అన్నిరంగాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటును కల్పించాయి. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు కీలక నిర్ణయాన్ని తీసుకోవడంతో అందులో భాగంగానే పనిగంటలను తగ్గించాయి. రిజర్వ్‌బ్యాంకు ఇండియా (ఆర్‌బిఐ)తో సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆరోగ్య నిమిత్తం పనిగంటలను కుదించినట్టుగా తెలిపింది.

వైరస్ సోకకుండా పనివేళల్లో మార్పులు
సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి. కానీ ఇకనుంచి బ్యాంకింగ్ సేవలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని బ్యాంకులు ప్రకటించాయి. ఈనెల 31వ తేదీ వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని ఎస్‌బిఐ, ఆంధ్రాబ్యాంక్ అధికారులు తెలిపారు. కస్టమర్లకు కూడా కరోనా వైరస్ సోకకుండా పనివేళల్లో మార్పులు చేస్తున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌లు సైతం డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని ఖాతా దారులకు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

Changes in working hours of Banks
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News