Saturday, April 20, 2024

షూటింగ్ గ్యాప్‌లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లు చిల్.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

Charan and NTR Chilling between shots

హైదరాబాద్: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా పీరియ‌డిక‌ల్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుంది. ఇక్కడ రామ్ చరణ్-అలియా, ఎన్టీఆర్-ఒవీలియాలపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, షూటింగ్ గ్యాప్ లో చ‌రణ్‌, ఎన్టీఆర్ స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతుండగా.. దీనిని జక్కన్న డ‌మ్మీ కెమెరాతో షూట్ చేస్తున్న వీడియోని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకుంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Charan and NTR Chilling between shots

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News