Tuesday, January 31, 2023

యముడికే లంచం ఇవ్వజూపాడు..!!

- Advertisement -

charles obang in uganda

పుణ్యం చేస్తే స్వర్గానికి, పాపం చేస్తే నరకానికి వెళ్తారని ఎవరైనా అంటుంటే మీరు విన్నారా ఎప్పుడైనా? ఆ..దాన్నే పక్కాగా ఫాలో అయ్యాడు ఓ వ్యక్తి. మనోడు చేసిన పాపాలకు చనిపోయాక పక్కాగా నరకానికే వెళ్తానని ఫిక్స్ అయ్యాడో ఏమో… ఏకంగా యముడికి లంచం ఇచ్చి స్వర్గానికి వెళ్దామనుకున్నాడట ఓ వ్యక్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా…. ఆసక్తికరమైన స్టోరీ ఇది….

ఉగండా కు చెందిన చార్లెస్ ఒబాంగ్.. దేశంలోనే మాంచి రిచ్ పర్సన్ అట. అయితే… మనోడు సంపాదించింది కష్టపడి కాదులేండి… అందరినీ కష్టపెట్టి… లంచాలు గట్రా తీసుకొని, అవినీతి పనులు చేసి బాగానే కూడబెట్టాడట.

charles obang in uganda

ఇక, మనోడికి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అనారోగ్యం కూడా పెరుగుతూ వచ్చిందట. 52 ఏళ్ల వయసుకు రాగానే… మనోడు మంచం పట్టాడట. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా… ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా.. మనోడి రోగం మాత్రం తగ్గలేదట. ఇక, మనోడు బతకడం కష్టమేనని… డాక్టర్లు కూడా చెప్పేశారట.

ఎలాగైనా చనిపోతానని తెలుసుకున్న ఒబాంగ్…తను చేసిన పాపాలకు… చనిపోయాక పక్కా నరకానికే వెళ్తానని గ్రహించి… స్వర్గం వెళ్లడానికి ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాడట. అందుకే ..యముడికి లంచం ఇచ్చైనా.. నరకాన్ని తప్పించుకోవాలని ఓ ప్లాన్ వేశాడట.

charles obang in uganda

కుటుంబ సభ్యులను పిలిచి.. తను చనిపోయాక… శవపేటిక లో కొన్ని డబ్బులు కూడా తనతో పాటు పెట్టి పూడ్చాలని చెప్పాడట. ఒబాంగ్ చెప్పినట్టు గానే… లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17 న ఒబాంగ్ చనిపోయాక అతడి శవపేటికలో 60 లక్షల షిల్లాంగ్స్ ను పెట్టి పూడ్చిపెట్టారట కుటుంబ సభ్యులు.

అయితే, తర్వాత ఈ విషయం చర్చి పెద్దలకూ తెలియడంతో… అలా డబ్బుతో ఖననం చేయడం ఆచారం కాదని… శవపేటికను తవ్వి బయటికి తీయించి, ఆ డబ్బులను తిరిగి ఒబాంగ్ కుటుంబ సభ్యులకు అందించారట చర్చి పెద్దలు.

ఇక, ఈ సంఘటనను సోషల్ మీడియాలో ఉగాండ్ కు చెందిన ఓ వ్యక్తి పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది ప్రపంచమంతా చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles