Home అంతర్జాతీయ వార్తలు చార్లీ హెబ్డో కార్టూన్‌పై మరోసారి విమర్శలు

చార్లీ హెబ్డో కార్టూన్‌పై మరోసారి విమర్శలు

Cartoon-Charlie-Hebdoపారిస్ : ప్రముఖ ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డో తన కార్టూన్‌తో మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవల ఇటలీని భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. దానిపై చార్లీ హెబ్డో ఒక కార్టూన్‌ను ప్రచురించింది. ‘ఎర్త్ క్వేక్, ఇటాలియన్ స్టైల్’ అనే పేరుతో ప్రచురితమైన ఈ కార్టూన్ ప్రస్తుతం విమర్శలను ఎదురుకుంటుంది. భూకంపం కారణంగా వేర్వేరు స్థాయిల్లో గాయపడిన వారి చిత్రాలను గీసి, వారికి ఒక్కొక్కరికీ ఒక్కో ఇటాలియన్ వంట పేర్లు పెట్టింది. గాయాలతో రక్తమోడుతున్న వారికి ఇలా వంటల పేర్లు పెట్టి హేళన చేయడంపై విమర్శలు వెల్లువెల్లాయి. ఈ కార్టూన్‌పై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇటలీ భూకంపం ధాటికి అమాట్రిస్ అనే పట్టణం తీవ్రంగా ధ్వంసమైంది. ఆ నగర మేయర్ సెర్గియో పిరోజి ఈ కార్టూన్‌పై స్పందిస్తూ ఫ్రెంచ్ ప్రజల పట్ల ఆ పట్ల ఎటువంటి బాధ లేదు… అందుకే ఇలా అసహ్యకరమైన కార్టూన్‌ను ప్రచురించిందని మండిపడ్డారు.