Wednesday, March 29, 2023

సౌతాఫ్రికాకు చావోరేవో

- Advertisement -

lady-sports

కేప్‌టౌన్: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే సిరీస్‌లో 21 ఆధిక్యంలో ఉన్న భారత్‌కు ఓడినా నష్టమేమి లేదు. ఒకవేళ ఓడితే సిరీస్ 11తో సమమవుతోంది. కాగా, దక్షిణాఫ్రికా ఓడితే మాత్రం సిరీస్‌ను కోల్పోక తప్పదు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళా జట్టు తాజాగా టి20 సిరీస్‌పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో సౌతాఫ్రికా సిరీస్ ఆశలకు బ్రేక్ పడింది. సిరీస్ గెలిచే అవకాశాలు ఎలాగో కోల్పోయిన సఫారీ మహిళా జట్టు కనీసం డ్రాతోనైనా గట్టెక్కాలని భావిస్తోంది. మూడో మ్యాచ్‌లో గెలిచి జోరుమీద కనిపించిన సౌతాఫ్రికా ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. ఒకవేళ నాలుగో మ్యాచ్ జరిగి ఉంటే సౌతాఫ్రికా గెలుపు అవకాశాలు అధికంగా ఉండేవి. అయితే వర్షం వల్ల మ్యాచ్ ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకుండానే అర్ధాంతరంగా రద్దయ్యింది. కాగా, ఈ మ్యాచ్‌ను రెండు జట్లు సవాలుగా తీసుకున్నాయి. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ పలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. మిథాలీ రాజ్, స్మృతి మందన సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మెరుపులు మెరిపిస్తోంది. వేదా కృష్ణమూర్తి నిలకడైన ఆటతో జట్టుకు అండగా నిలుస్తోంది. శిఖా పాండే, పూనమ్ యాదవ్‌లు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. దీంతో సిరీస్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా సమష్టిగా రాణించి సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు టీమిండియా తహతహలాడుతోంది. మరోవైపు ఆతిథ్య జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్ చేజారకుండా చూడాలని భావిస్తోంది. కెప్టెన్ నికర్క్, లిజెల్లి లి, డుప్రిజ్, మసబాతా క్లాస్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక షబ్నమ్ ఇస్మాయిల్ రూపంలో మ్యచ్ విన్నర్ బౌలర్ జట్టుకు అందుబాటులో ఉంది. ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News