Saturday, April 20, 2024

రుణాల పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -
cheating in the name of loans in hyderabad
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు

హైదరాబాద్: రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, 24 డెబిట్ కార్డులు, మూడు బ్యాంక్ పాస్‌బుక్‌లు, 10 బ్యాంక్ చెక్‌బుక్‌లు, రూ.2లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ఢిల్లీకి చెందిన విజయ్ దవాన్, కపిల్ ఠాగూర్, అభయ్ వర్మ ముగ్గురు కలిసి గతంలో కాల్ సెంటర్‌లో పనిచేశారు. ఆ సమయంలో కాల్ సెంటర్ నిర్వహకులు రుణాల పేరు చెప్పి డబ్బులు వసూలు చేయమని చెప్పేవారు. కరోనా రావడంతో ముగ్గురు ఉద్యోగాలు కోల్పోయారు.

ప్రధాన నిందితుడు విజయ్ ధవన్ రుణాలు ఇప్పిస్తామని దక్షిణ భారతదేశానికి చెందిన వారికి చెప్పి డబ్బులు వసూలు చేద్దాని స్నేహితులకు చెప్పారు. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్, తాడ్‌బండ్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. బజాజ్ ఫైనాన్స్‌లో తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని చెప్పారు. రుణం మంజురు చేసేందుకు వివిధ ఖర్చుల కింద బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని చెప్పడంతో బాధితుడు నమ్మాడు. దశలవారీగా రూ.9,44,351 వసూలు చేశారు. ఇలాగే నగరానికి చెందిన విరాట్, హార్దిక్, రోహిత్‌కు పర్సనల్ లోన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పై మధుసూదన్ రావు కేసు దర్యాప్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News