Tuesday, April 23, 2024

రేల్వే ఉద్యోగాల పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

vc sajjanar

హైదరాబాద్: రైల్వే ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్, శంషాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, నకిలీ జాబ్ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘజియాబాద్,ఇందిరాపురానికి చెందిన సర్వేష్ సాహు అలియాస్ అశోక్ కుమార్ సింగ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపిలోని విజయవాడకు చెందిన అబ్దుల్ మజీద్ అలియాస్ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఢిల్లీకి చెందిన మిశ్రా, కోల్‌కతాకు చెందిన దినేష్ కలిసి ముఠాగా ఏర్పాటు మోసం చేస్తున్నారు.

బాధితుడు 2019, అక్టోబర్‌లో తన స్నేహితులతో కలిసి అబ్దుల్ మజీద్ అలియాస్ శ్రీనివాస్, సర్వేష్ సాహు అలియాస్ అశోక్‌కుమార్ సింగ్‌ను సోషల్ మీడియా ద్వారా సంప్రదించాడు. బ్యాక్ డోర్ నుంచి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు దానికి డబ్బులు ఖర్చు అవుతాయని తెలిపారు. దీనికి అంగీకరించిన బాధితులు దశల వారీగా రూ.6,30,000 చెల్లించారు. ఇలా పలువురు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒకో బాధితుడి నుంచి రూ.5 నుంచి రూ.6 లక్షలు తీసుకున్నాడు. అబ్దుల్ మజీద్ అలియాస్ శ్రీనివాస్ కూడా గతంలో డబ్బులు కట్టి మోసపోయాడు.

దీంతో తానే ముఠాలో సభ్యుడిగా చేరి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. ఇంజనీరింగ్ చేసిన మజీద్ ఎపి, తెలంగాణకు మీడియేటర్‌గా పనిచేస్తున్నాడు. ముందుగా రూ.50,000 ఇచ్చిన వారికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు పంపించారు. తర్వాత శిక్షణ సమయంలో రూ.2లక్షలు తీసుకున్నారు. శిక్షణ మొత్తం పూర్తి చేసుకున్న వారి వద్ద నుంచి రూ.6లక్షలు తీసుకున్నారు. తర్వాత ముఖం చాటేశారు, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల బండారం బయటపడింది. ఎస్‌ఓటి ఎడిసిపి సందీప్ ఆధ్వర్యంలో ఇన్స్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్సైలు, పిసిలు దర్యాప్తు చేశారు.

మూడు నెలలు శిక్షణ…

నిందితులు మిశ్రా, దినేష్ ఇద్దరు కలిసి బాధితులకు శిక్ష ఏర్పాట్లు చేశారు. బాధితులకు ఉద్యోగానికి ఎంపికయ్యారని నకిలీ లెటర్లు పంపిస్తూ ఒక బ్యాచ్‌కు 15 నుంచి 20 మందికి శిక్షణ ఇస్తున్నారు. బాధితులకు ఏకంగా ఢిల్లీలోని రైల్వే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఇలా అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇచ్చారు, సౌత్‌ఇండియాలో పనిచేసే వారు డిఆర్‌ఎం ఆఫీస్, ఖరగ్‌పూర్‌లో, ఢిల్లీలో పనిచేసే వారు డిఆర్‌ఎం ఆఫీస్ పహాడ్ గంజ్‌లో రిపోర్టు చేయాలని నమ్మించారు. తర్వాత నకిలీ ఈమేయిల్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్లు పంపించడంతో బాధితులు ముందుగా రూ.2లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. డబ్బులు కట్టిన వారికి పశ్చిమ బెంగాల్‌లోని బండాల్, ఢిల్లీలో శిక్షణ ఇచ్చారు.

మూడు నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత అభ్యర్థులను ఇంటికి పంపించారు. కొద్ది రోజులకు వెంటనే జాబ్‌లో రిపోర్ట్ చేయాలని మేయిల్ పంపించారు. ఇది నమ్మిన బాధితులు సర్వేష్ సాహును కలిశారు. వెంటనే రూ.3లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో కట్టారు. బాధితులకు ఐడి కార్డు, మిగతా డాక్యుమెంట్లు ఇచ్చి రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాలిని చెప్పారు. అప్పటి నుంచి వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు ఢిల్లీలోని రైల్వే కార్యాలయాన్ని సంప్రదించారు. దీంతో తమను రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేశారని తెలుసుకున్నారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఇక్కడి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టు చేశారు.

cheating in the name of railway jobs in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News