Thursday, April 25, 2024

ట్రేడింగ్ పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Cheating in the name of trading

రూ.1.20 కోట్లు ముంచిన ఇద్దరు నిందితులు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు మొబైల్స్, డెబిట్, క్రెడిట్ కార్డులు, రూ.1,02,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. మధ్యప్రదేశ్, ఇండోర్‌కు చంఎదిన రాజత్ పాత్రియా, అశ్విన్ బాగ్‌డరే ఇద్దరు కలిసి మోసాలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి అమాయకులను మోసం చేయాలని ప్లాన్ వేశారు. దానికి అనుగుణంగా వివిధ పేర్లతో అన్ని బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన బాధితురాలికి ఆన్‌లైన్‌లో నిందితులు పరిచయమయ్యారు.

తమలింక్ ద్వారా డిమ్యాట్ ఖాతా ఓపెన్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు డిమ్యాట్ ఖాతా ఓపెన్ చేసి నిందితులను రూ.5లక్షలు పంపించింది. వాటితో ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తామని నిందితులు చెప్పారు. కొద్ది రోజుల తర్వాత నిందితులు మీకు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.88లక్షలు వచ్చాయని తెలిపారు. వాటిని విత్‌డ్రా చేయలంటే రూ.1.20 కోట్లు పే చేయాలని చెప్పారు. దీనిని నమ్మిన బాధితురాలు నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లోకి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించింది. తర్వాత నుంచి నిందితులు స్పందించడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు మార్చి 1, 2021న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్స్‌స్పెక్టర్ హరిభూషన్ రావు, ఎస్సై సురేష్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News