Home కామారెడ్డి జిరాక్స్‌ కరెన్సీతో మోసం…

జిరాక్స్‌ కరెన్సీతో మోసం…

Xerox Currency

 

నవీపేట్ : నవీపేట్ మండల కేంద్రంలో గల శ్రీ హనుమాన్ ఏజెన్సీ చందు మనీట్రాన్స్‌ఫర్ కేంద్రంలో శనివారం రాత్రి 7.30 ని॥లకు గుర్తు తెలియని దుండగుడు యుఎఈకి కరెన్సీ ధిర్హమ్‌ల జిరాక్స్‌లు ఇచ్చి రూ.89 వేలు ఇండియన్ కరెన్సీతో ఉడాయించిన సంఘటన జరిగింది.

బాధితుడు చందు కథనం ప్రకారం శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రూ.4,800 విలువైన యుఎఈ కరెన్సీ ధరమ్‌లు నల్లని పాకెట్‌లో తీసుకొచ్చి ఇండియన్ కరెన్సీ అడుగగా తమ ఆపరేటర్ రేఖ వాటికి మొత్తంగా రూ.89 వేలు చెప్పగా, విలువ తక్కువగా ఇస్తున్నారని చెప్పి మోసగాడు వాపస్ తీసుకున్నాడని, తర్వాత బేరసారాలు ఆడి ఒరిజినల్ కరెన్సీ గల పాకెట్‌ను మార్చి జిరాక్స్ గల పాకెట్‌ను ఇచ్చి రూ.89 వేల ఇండియన్ కరెన్సీని తీసుకుపోయాడని, ఆ పాకెట్‌ను విప్పి చూడగా అందులో జిరాక్స్ కరెన్సీ ఉండడాన్ని చూసి అవాకైన ఆపరేటర్ రేఖ తనకు సమాచారం ఇవ్వగా వెంటనే దుకాణానికి వచ్చి సీసీ ఫుటేజీ పరిశీలించిన పిదప పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇలాంటి ఘటనలు సదరు మోసగాడు గత వారం నిజామాబాద్‌లోని ఒక ట్రావెల్స్‌లో కూడా ఇదే విధమైన మోసం జరిపాడని సమాచారం.

Cheating with Xerox Currency