*పని చేసిన ప్రతిచోట బోర్డుల ఏర్పాటు
*ఒక పని ఒకేసారి చేయాలని నిర్ణయం
*చేసిన పనులకు సమాచార బోర్డుల ఏర్పాటు
*బోర్డుపై ఖర్చుల వివరాలు నమోదు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద చే పట్టే పనుల్లో అవకతవకలు జరుగకుండా ఇక నుంచి పారదర్శకంగా వ్యవహరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఖర్చు చేసిన ప్రతి పనికి ప్రజలకు లెక్క చూపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల పనులకు జీ యో ట్యాగింగ్ అమలు చేసినా అక్రమాలు తగ్గడం లేదు. దీంతో మరిన్ని సంస్కరణలు తీసుకచ్చేలా అనేక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో చేసిన పనుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండాలని పూర్తి సమాచారంతో కూడిన నోటీస్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామంలోని ఓ ముఖ్య కూడళి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఉపాధి హామి పనుల పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తున్నారు.మండలంలో మొత్తం 9081 మందికి జాబ్ కార్డు లు, 673 శ్రమ శక్తి సంఘాలు ఉన్నాయి. వీరందరు వివిధ ఉపాది పనుల్లో పాల్గొంటున్నారు. రహదారులు, ముళ్లపోదల తొలగింపు, ఇంకు డు గుంతలు, హరితహారం, అడవిలో కందక కాల్వల పనులను చేపడుతున్నారు. ఉపాధి నిధులు వృద కాకుండా చేసిన పనుల్లో నాణ్యత లో పాన్ని తనిఖీల్లో గుర్తిస్తున్నారు.
ఏడు రికార్డులు రూపోందించాలి : ఉపాధి పనుల్లో పారదర్శకతను మ రింత పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు గ్రామ కార్యదర్శులు పనుల గుర్తింపు,కూలీల సంఖ్యను నమోదు చేయ డం మస్టర్లను వేయడానికి ఆధికారులు పరిమితమయ్యేవారు. కానీ ఈ రికార్డులను పర్యవేక్షించే బాధ్యతలను కూడా సంబందిత ఎంపిడివో కా ర్యదర్శులకు అప్పగించారు. పనుల గుర్తింపు, ఖర్చు, వేతనాల చెల్లింపు, ఫిర్యాదు ఇలా ఏడు రకాల దస్త్రాలను నిర్వహించాల్సి ఉంటుంది.
ఆదేశాల మేరకే శిరీష, ఏపీఓ, కోహెడ : ఉపాధి హామిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న పనుల వివరాలను పారదర్శకంగా ఉండేందుకు ప్రతీ గ్రామం లో బోర్డులను ఏర్పాటు చేసి సమాచారం ఆందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారు లు ఆదేశించారు. ఈ బోర్డులపైన అయా గ్రామాల్లో చేపట్టిన పూర్తి స మాచారాన్ని ఆందుబాటులో ఉంచుతున్నాం. దాదా పు అన్ని గ్రామాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు నిరోదించడానికే ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రతీ గ్రామం లో బోర్డులను ఏర్పాటు చేసి సమాచారాన్ని ఆందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.