Home తాజా వార్తలు కూకట్‌పల్లిలో చెడ్డి గ్యాంగ్ కలకలం

కూకట్‌పల్లిలో చెడ్డి గ్యాంగ్ కలకలం

 

Cheddi Gang

హైదరాబాద్: చెడ్డి గ్యాంగ్ మరోసారి సంక్రాంతి పండుగపై గురి పెట్టింది. కూకట్‌పల్లిలో కెపిహెచ్‌బి లిమిట్స్‌లో కాలనీల్లో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి ప్రయత్నించినట్టు అక్కడి సిసి కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు చెడ్డి గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నగర వాసులు సంక్రాంతి పండుగకు గ్రామాలు వెళ్తుండటంతో చెడ్డి గ్యాంగ్ హైదరాబాద్ నగరంపై దృష్టి పెట్టిందని పోలీసులు వెల్లడించారు. పగటిపూట కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసిన ఇండ్లే వీరి లక్ష్యంగా చేసుకుంటారని సమీపంలోని చెట్లపొదలే వీరి స్థావరాలుగా మలుచుకొని రాత్రివేళల్లోనే చోరీలకు పాల్పడుతారు.  చెడ్డి గ్యాంగ్ తమ కాలనీల్లోకి వచ్చిందని తెలియగానే స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో గుజరాత్ నుంచి వచ్చిన చెడ్డి గ్యాంగ్‌ను క్లీప్ స్వీప్ చేశామని రాచకొండ పోలీసుల వెల్లడించిన విషయం తెలిసిందే.

Cheddi Gang Caught Camera in Kukatpally
Telangana news