Home తాజా వార్తలు నిజామాబాద్ లో భారీ దోపిడీ

నిజామాబాద్ లో భారీ దోపిడీ

Massive Robberyనిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ ఆదివారం అర్థరాత్రి హల్ చల్ సృష్టించింది. న్యాలకల్ రోడ్డులో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 16 తులాల బంగారంతో పాటు రూ.50వేల నగదును అపహరించారు. ఇంట్లోవారిని బంధించి ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగిన తీరును బట్టి , ఈ చోరీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  పోలీసులు క్లూస్ టీమ్స్ తో వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో నిజామాబాద్ జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

Cheddi Gang Hulchul In Nizamabad On Sunday Night